వాయిదా పడిన జగన్ ఆస్తుల కేసు విచారణ.. ఎప్పటి వరకు అంటే.. ?

ఏపీ సీఎం జగన్ పై ఎప్పటి నుండో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఇక టీవీ సీరియల్ ఎలాగైతే సాగుతుందో అలా ఈ అక్రమాస్తుల కేసు కూడా సాగుతూ వస్తుందట.

 Postponed Jagan Assets Case Hearing, Ap Cm, Ys Jagan, Assets Case, Hearing, Post-TeluguStop.com

ఈ వ్యవహారంలో నేడు సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టగా సీఎం జగన్ తాను విచారణకు హజరు కాలేక పోతున్నానని కాబట్టి తన తరపున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారట.

కాగా హైకోర్టు జడ్జి సెలవులో ఉండటంతో పిటిషన్ విచారణకు రాలేదని కూడా సీబీఐ-ఈడీ కోర్టుకు వివరించారట.

ఈ క్రమంలో కోర్టు విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేస్తూ ఈ కేసులో జగన్ తరఫు వాదనలు కూడా అవసరమని అభిప్రాయపడిందట.ఇకపోతే అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందో సంస్థలకు భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందన్న అభియోగాలతో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ 2016లో కేసు నమోదు చేసి సీఎం జగన్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

కాగా నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఈ కేసు ఏదో ఒక కారణంతో వాయిదాపడుతు వస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube