బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.చండూరులో ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి కేటాయించారంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.అనంతరం ఆయనకు రూ.18 వేల కాంట్రాక్ట్ వచ్చిన నేపథ్యంలో అమ్ముడు పోయారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించినట్లు సమాచారం.

తాజా వార్తలు