సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో వరుస విజయాలను అందు కుంటున్నాడు.
ప్రెసెంట్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.ఎఫ్ 3 సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.ఇక ఇటీవలే మరో పాట కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ రోల్ లో నటిస్తుంది అనే విషయం విదితమే.
ఈమె చేసిన స్పెషల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను ఈ రోజు రిలీజ్ చేసారు.లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే సాంగ్ కు పూజా ఆడిపాడినట్టు తెలుస్తుంది.ఈ సాంగ్ లో వరుణ్ తేజ్, వెంకటేష్ పూజా హెగ్డే తో పోటీ పడి మరీ వేశారు.
ఈ ప్రోమో అందరిని ఆకట్టు కుంటుంది.
ఇక ఎప్పటి లాగానే పూజా తన అందచందాలతో అలరించింది.ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఈమె అందాల ఆరబోత ఏ రేంజ్ లో చేసిందో.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగి పోయాయి.
మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమా కూడా నవ్వించడం ఖాయంగా కనిపిస్తుంది.మరి సమ్మర్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి టీమ్ అంతా సిద్ధం అవుతుంది.
చూడాలి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy