పొన్నియన్ సెల్వన్ లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మీకు తెలుసా?

మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటులు నటించడం గమనార్హం.

 Ponniyan Selwan Movie Budget Remuneration Details, Ponniyin Selvan, Ps 1, Ponniy-TeluguStop.com

పొన్నియన్ సెల్వన్ ఒక విధంగా మణిరత్నం కలల ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని మణిరత్నం భావిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కి సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించగా ఆ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం అందుతోంది.

 Ponniyan Selwan Movie Budget Remuneration Details, Ponniyin Selvan, Ps 1, Ponniy-TeluguStop.com

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నందిని పాత్రను పోషించగా ఈ పాత్ర కోసం ఐశ్వర్యా రాయ్ 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.

జయం రవి రాజ రాజ చోళుని పాత్రను పోషించగా ఆ పాత్ర కోసం జయం రవి 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.

కార్తి వంథియ దేవన్ పాత్రలో నటించగా ఆ పాత్ర కోసం కార్తి 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన త్రిష ఆ పాత్ర కోసం 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది.ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మీ ఈ సినిమా కోసం చెరో కోటిన్నర రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

సెట్టింగ్స్ వేసి భారీ విజువల్ ఎఫెక్స్ట్స్ తో ఈ సినిమాను షూట్ చేయడంతో ఈ సినిమాకు భారీగానే ఖర్చైందని తెలుస్తోంది.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమాతో నిర్మాతగా మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube