పొన్నియన్ సెల్వన్ లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మీకు తెలుసా?

మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే.

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటులు నటించడం గమనార్హం.

పొన్నియన్ సెల్వన్ ఒక విధంగా మణిరత్నం కలల ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని మణిరత్నం భావిస్తున్నారు.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కి సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించగా ఆ పాత్ర కోసం విక్రమ్ ఏకంగా 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నందిని పాత్రను పోషించగా ఈ పాత్ర కోసం ఐశ్వర్యా రాయ్ 10 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.

జయం రవి రాజ రాజ చోళుని పాత్రను పోషించగా ఆ పాత్ర కోసం జయం రవి 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.

కార్తి వంథియ దేవన్ పాత్రలో నటించగా ఆ పాత్ర కోసం కార్తి 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

"""/" / ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన త్రిష ఆ పాత్ర కోసం 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మీ ఈ సినిమా కోసం చెరో కోటిన్నర రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

సెట్టింగ్స్ వేసి భారీ విజువల్ ఎఫెక్స్ట్స్ తో ఈ సినిమాను షూట్ చేయడంతో ఈ సినిమాకు భారీగానే ఖర్చైందని తెలుస్తోంది.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమాతో నిర్మాతగా మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి