గ‌ర్భిణీలు దానిమ్మ‌ను తినే ముందు ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిన‌వి ఇవే!

మామూలు స‌మ‌యంతో పోలిస్తే.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స్త్రీలు ఎన్నో ఆహార నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది.

ఎందుకంటే, ఏ చిన్న పొర‌పాటు చేసినా త‌ల్లే కాకుండా క‌డుపులోని శిశువు కూడా ఎఫెక్ట్ అవుతుంది.అందుకే ఏ ఫుడ్ తీసుకున్నా.

చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.అయితే గ‌ర్భిణీల‌ను పండ్లు ఎక్కువ‌గా తిన‌మ‌ని చెబుతుంటారు.

ముఖ్యంగా ప్ర‌తి రోజు దానిమ్మ పండు తీసుకోవాల‌ని.త‌ద్వారా పుట్ట‌బోయే పిల్ల‌లు ఆరోగ్యంగా, తెల్ల‌గా పుడుతార‌ని చెబుతుంటారు.

Advertisement

అవును, గ‌ర్భిణీల‌కు దానిమ్మ పండు ఎంతో మేలు చేస్తుంది.విట‌మిన్ బి, విటమిన్ సి, విట‌మిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, జింక్‌, సోడియం, పొటాషియం, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు ఉండ‌టం వ‌ల్ల‌.దానిమ్మ అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.గ‌ర్భిణీలు దానిమ్మ పండును తీసుకునే ముందు ఖ‌చ్చితంగా కొన్ని విష‌యాల‌ను తెలుసుకోవాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.దానిమ్మ పండు హెల్త్‌కు మంచిదే.

అలా అని ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వాటిని ఓవ‌ర్‌గా తీసుకుంటే మాత్రం.నెల‌లు నిండ‌కుండానే ప్ర‌స‌వం అయ్యే అవ‌కాశాలు పెరిగి పోతాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అలాగే దానిమ్మ అధిక చ‌క్కెర శాతాన్ని క‌లిగి ఉంటుంది.అందు వ‌ల్ల‌, గ‌ర్భిణీలు దానిమ్మ పండ్ల‌ను ప‌రిమితికి మించి తీసుకుంటే.

Advertisement

మ‌ధుమేహం బారిన ప‌డ‌తారు.

ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో స‌హ‌జంగానే బ‌రువు పెరుగుతారు.అయితే దానిమ్మ పండ్ల‌ను అతిగా తీసుకుంటే మ‌రింత బ‌రువు పెరుగుతారు.ఎందుకంటే, దానిమ్మలో పోష‌కాల‌తో పాటుగా కేల‌రీలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

ఇక ర‌క్త పోటు స్థాయిల‌ను త‌గ్గించే గుణం దానిమ్మ పండ్ల‌కు ఉంది.అందు వ‌ల్ల‌, లో బీపీతో బాధ ప‌డే గ‌ర్భిణీ స్త్రీలు దానిమ్మ పండును ఓవ‌ర్‌గా తీసుకుంటే.

చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

తాజా వార్తలు