తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ అనే నకిలీ జీవో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావటం తెలిసిందే.దీంతో వచ్చిన ఈ వార్తలపై స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు తెలియజేశారు.ఈ క్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.

లాక్ డౌన్ అమలు చేయడం వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.భవిష్యత్తులో కూడా లాక్ డౌన్ అమలు చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అనే నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని తాజాగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కార్వే అనే కంపెనీలో సీఏ గా పనిచేస్తున్న శ్రీపతి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ నకిలీ జీవో నీ సృష్టించినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించి ఈరోజు ఉదయం అతనిని అరెస్టు చేశారు.