ఇక ప్రియాంక మార్క్ పాలిటిక్స్ మొదలవుతాయా?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.నిజానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) రావాలనే వాదన గత రెండు దశాబ్దాలుగా ఉంది నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో పాటు , అద్భుతమైన వాక్చాతుర్యం ఆమె సొంతం.

 Can Priyanka Gandhi Enter Into Mainstream Politics ,priyanka Gandhi , Rahul Gan-TeluguStop.com

రాహుల్ గాంధీ కన్నా ప్రియాంకనే ప్రతిభావంతురాలని, ప్రభావం చూపించే నేత అన్న అంచనాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి … అయితే ఇంతకాలం తల్లి నియోజకవర్గం లోను అన్న రాహుల్ నియోజకవర్గం లో మాత్రమే ప్రచారానికి పరిమితమైపోయిన ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి అంత ఆసక్తి చూపించలేదు.మొదట్లో చాలా హడావిడి చేసిన కాంగ్రెస్ శ్రేణుకలు కూడా రాహుల్ గాంధీ క్రమంగా రాటు దేలడం తో కొంత సైలెంట్ అయ్యారు.

Telugu Indiannational, Indira Gandhi, Modi, Priyanka Gandhi, Rahul Gandhi-Telugu

అయితే శరవేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు ఆమె ఎంట్రీ తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తున్నాయి.రాహుల్ గాంధీ అనర్హత విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో ఖరారు కాలేదు ప్రస్తుతానికి కోర్టులో పోరాడుతూ, సామాన్య జనంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించే విధంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుంది.ఒకవేళ కోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే వాయనాడ్ లోక్ సభ స్థానం ఖాళీ అవుతుంది .

Telugu Indiannational, Indira Gandhi, Modi, Priyanka Gandhi, Rahul Gandhi-Telugu

అప్పుడు ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు అంచనా వేస్తున్నారు .రాహుల్ గాంధీ కూడా జైలుకు వెళ్లడానికి కూడా నేను సిద్ధమని కేంద్ర ప్రభుత్వ ధమన నీతిని పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలంటే ఇదే మంచి మార్గం అంటూ పార్టీ సమావేశంలో చెప్పుకొచ్చారని, దీనిని బట్టి జైలుకు వెళ్లడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.ఒకప్పుడు ఇందిరా గాంధీ( Indira Gandhi ) కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజకీయాల లోకి వచ్చారని అయితే అతి తక్కువ సమయంలోనే ఆమె తన తెలివితేటలతో నాయకత్వ లక్షణాలతో పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించారని ., పేద ప్రజలలో దేవత అయ్యారని ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి చేయని స్థాయిలో పేద ప్రజలకు మంచి చేశారని ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ఆవిడ అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను కూడా అందుకు అనుగుణంగానే ఉండడంతో ఇక రానున్నది ప్రియాంక మార్క్ రాజకీయమేనని ప్రచారం జరుగుతుందిమరి పూర్తిస్థాయి రాజకీయ ప్రయాణానికి ఆమె ఎంతవరకు సిద్ధమవుతుందో ఆమె రాకతో దేశ రాజకీయాల్లో రాబోయే మార్పులు ఏమిటో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube