అదేంటి వాట్సాప్ ఘోస్ట్ ఫీచర్లా? మేము ఘోస్ట్ రైడర్ గురించి విన్నాం కానీ ఘోస్ట్ ఫీచర్లు( Ghost Features ) ఏమిటి అని సందేహిస్తున్నారా? నేడు వాట్సాప్ ( Whatsapp ) వాడుతున్న చాలామందికి వీటిపైన అంతగా అవగాహన లేదని చెప్పుకోవాలి.ఇపుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తరచూ టచ్‌లో ఉండటానికి బెస్ట్ ఆప్షన్ గా వాట్సాప్ మారింది అనడంలో సందేహమే లేదు.
అయితే దీనివలన కొంతమంది అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ వుంటారు.ముఖ్యంగా ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చామో చూడాలని కాచుకుకూర్చునే మాజీ ప్రియులు కావచ్చు, రాత్రి ఎప్పటివరకు ఫోన్ వాడారోనని గమనించే కుటుంబ సభ్యులు కావచ్చు… ఇలాంటి వాళ్ళ వలన ఇబ్బందులను గమనించిన వాట్సాప్ కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది.

అవే ప్రైవసీ ఫీచర్లు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే ఆప్షన్లు వాట్సాప్‌లో చాలానే ఉన్నాయి.వీటిని ఉపయోగించి మీరు ఎవరికీ తెలియకుండా వాట్సాప్‌ను వాడుకోవచ్చన్నమాట.ఈ క్రమంలో ముందుగా లాస్ట్ సీన్, ఆన్లైన్ స్టేటస్ కనిపించకుండా చేయవచ్చు.వాట్సాప్‌లో ముఖ్యమైన వ్యక్తులతో బిజీగా ఉండి కొందరి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేకపోతే వారు నొచ్చుకునే అవకాశం ఉంది.అలాంటి పరిస్థితి రాకుండా మనం ఆన్‌లైన్‌లోకి వచ్చామన్న విషయాన్ని తెలియనీయకుండా చేయొచ్చు.
అందుకు వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌కు వెళ్లి.అందులోని ‘లాస్ట్ సీన్’ను ( Last Seen ) ‘నోబడీ’కి సెట్ చేసుకుంటే సరిపోతుంది.

ఇదే విధంగా ఆన్లైన్ స్టేటస్‌ను కూడా ‘సేమ్ యాస్ లాస్ట్ సీన్’గా మార్చేస్తే సరి.ఇక బ్లూ టిక్‌లు లేకుండా చేయొచ్చని తెలిసిందే.వాట్సాప్‌లో మెసేజ్‌లను చూసిన తర్వాత బ్లూకలర్‌లో డబుల్ టిక్ మార్క్ పడుతుంది.అలా బ్లూ టిక్ పడనీయకుండా ‘రీడ్ రిసీప్ట్స్’ను టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.అంతేకాకుండా వాట్సాప్‌లో స్టేటస్ అప్డేట్లను సైతం నచ్చినవారితోనే పంచుకోవచ్చు.స్టేటస్ పెట్టే ముందు స్క్రీన్‌పై ఆడియన్స్ ట్యాప్ ఉంటుంది.
మనకు నచ్చినట్లు అక్కడే ఆప్షన్స్ మార్చుకోవచ్చు.అంతేకాకుండా ప్రొఫైల్ ఫొటో కూడా కనిపించకుండా చేసుకోవచ్చు.
దీన్ని ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్, ప్రైవసీ ఆప్షన్‌లోని ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి ‘నోబడీ’ని ఎంచుకుంటే సరిపోతుంది.







