వాట్సాప్ ‘ఘోస్ట్’ ఫీచర్లు గురించి ఎపుడైనా విన్నారా?

అదేంటి వాట్సాప్ ఘోస్ట్ ఫీచర్లా? మేము ఘోస్ట్ రైడర్ గురించి విన్నాం కానీ ఘోస్ట్ ఫీచర్లు( Ghost Features ) ఏమిటి అని సందేహిస్తున్నారా? నేడు వాట్సాప్ ( Whatsapp ) వాడుతున్న చాలామందికి వీటిపైన అంతగా అవగాహన లేదని చెప్పుకోవాలి.

ఇపుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తరచూ టచ్​లో ఉండటానికి బెస్ట్ ఆప్షన్ గా వాట్సాప్ మారింది అనడంలో సందేహమే లేదు.

అయితే దీనివలన కొంతమంది అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ వుంటారు.ముఖ్యంగా ఎప్పుడు ఆన్​లైన్​లోకి వచ్చామో చూడాలని కాచుకుకూర్చునే మాజీ ప్రియులు కావచ్చు, రాత్రి ఎప్పటివరకు ఫోన్ వాడారోనని గమనించే కుటుంబ సభ్యులు కావచ్చు.

ఇలాంటి వాళ్ళ వలన ఇబ్బందులను గమనించిన వాట్సాప్ కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. """/" / అవే ప్రైవసీ ఫీచర్లు.

ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే ఆప్షన్లు వాట్సాప్​లో చాలానే ఉన్నాయి.వీటిని ఉపయోగించి మీరు ఎవరికీ తెలియకుండా వాట్సాప్​ను వాడుకోవచ్చన్నమాట.

ఈ క్రమంలో ముందుగా లాస్ట్ సీన్, ఆన్​లైన్ స్టేటస్​ కనిపించకుండా చేయవచ్చు.వాట్సాప్​లో ముఖ్యమైన వ్యక్తులతో బిజీగా ఉండి కొందరి మెసేజ్​లకు రిప్లై ఇవ్వలేకపోతే వారు నొచ్చుకునే అవకాశం ఉంది.

అలాంటి పరిస్థితి రాకుండా మనం ఆన్​లైన్​లోకి వచ్చామన్న విషయాన్ని తెలియనీయకుండా చేయొచ్చు.అందుకు వాట్సాప్​లో సెట్టింగ్స్​లోని ప్రైవసీ ఆప్షన్​కు వెళ్లి.

అందులోని 'లాస్ట్ సీన్'ను ( Last Seen ) 'నోబడీ'కి సెట్ చేసుకుంటే సరిపోతుంది.

"""/" / ఇదే విధంగా ఆన్​లైన్ స్టేటస్​ను కూడా 'సేమ్ యాస్ లాస్ట్ సీన్'గా మార్చేస్తే సరి.

ఇక బ్లూ టిక్​లు లేకుండా చేయొచ్చని తెలిసిందే.వాట్సాప్​లో మెసేజ్​లను చూసిన తర్వాత బ్లూకలర్​లో డబుల్ టిక్ మార్క్ పడుతుంది.

అలా బ్లూ టిక్ పడనీయకుండా 'రీడ్ రిసీప్ట్స్​'ను టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.

అంతేకాకుండా వాట్సాప్​లో స్టేటస్ అప్డేట్లను సైతం నచ్చినవారితోనే పంచుకోవచ్చు.స్టేటస్ పెట్టే ముందు స్క్రీన్​పై ఆడియన్స్ ట్యాప్ ఉంటుంది.

మనకు నచ్చినట్లు అక్కడే ఆప్షన్స్ మార్చుకోవచ్చు.అంతేకాకుండా ప్రొఫైల్ ఫొటో కూడా కనిపించకుండా చేసుకోవచ్చు.

దీన్ని ఎవరికీ కనిపించకుండా సెట్టింగ్స్​, ప్రైవసీ ఆప్షన్​లోని ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి 'నోబడీ'ని ఎంచుకుంటే సరిపోతుంది.