Alia bhatt Sai Pallavi : ఆలియాభట్‌ కు అదే ప్లస్, సాయిపల్లవికి నెగటివ్ పాయింట్!

గురువారం తెలుగు సినిమాకి అవార్డుల వర్షం కురిసింది.తెలుగు సినిమాకి 10 అవార్డులు రాగా RRR కి 6 అవార్డులు వచ్చాయి.

పుష్ప కి 2 అవార్డులు వచ్చాయి.69 ఏళ్లుగా ఏ తెలుగు హీరో సాధించలేని ఘనతను ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ సాధించి ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నారు.దీంతో ఇప్పుడు మరో టాపిక్ వైరల్ అవుతుంది.

మరి ఉత్తమ నటిగా ఇద్దరి మీద చర్చ జరుగుతుంది.వారే ఆలియాభట్‌, సాయిపల్లవి.

ఆలియాభట్‌ గంగూభాయ్ సినిమా( Gangubai Kathiawadi )లో వేశ్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచుకుంది.ఈ సినిమాలో గంగూభాయ్ అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

రానాతో కలిసి నటించిన విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి అద్భుతంగా నటించింది.అయితే ఆలియాభట్‌ గంగూభాయ్ పాత్రలో అద్భుతంగా నటించడంతో ఉత్తమ నటిగా పురస్కారం రావొచ్చని అందరు అనుకున్నారు.

ఈ సినిమాలో ఆలియా ఇంట్లో వారితో ఫోన్‌లో మాట్లాడే సన్నివేశం చూశాక ఆ నమ్మకం బలపడింది.అయితే ఆలియా బీజేపీకి వ్యక్తిరేకంగా మాట్లాడిందనే వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఆ తరువాత తను మాట్లాడింది ఫేక్ న్యూస్ అని వచ్చింది.ఆధారాలు లేకపోవడంతో అంతా నార్మల్ అయ్యింది.

ఇక ఆలియాకి కాకుండా ఉత్తమ నటిగా సాయిపల్లవి పురస్కారం రావచ్చు అనుకున్నారు.సాయిపల్లవి( Sai Pallavi ) మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక విరాటపర్వం సినిమాలో అద్భుతంగా నటించింది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ముఖ్యంగా క్లైమాక్స్ లో ఏడిపించేసింది.తన నటనతో ఆకట్టుకుంది.

Advertisement

ఎమోషనల్ పాత్రలో తనకి తనే దుబ్బింగ్ కూడా చెప్పుకుంది.ఇంకేముంది ఉత్తమ నటిగా సాయిపల్లవికి పురస్కారం వస్తుంది అనుకున్నారు.

అయితే ఇక్కడ మరో సమస్య ఉంది.ఈ సినిమాల్లో వీరి నటన అద్భుతంగా ఉన్నప్పటికీ వీరు చేసిన పాత్రలకి అవార్డులు ఇస్తారా అనే ప్రశ్న కూడా ఎదురైంది.ఎందుకంటే ఆలియా( Alia bhatt ) గంగూబాయ్‌లో వేశ్య పాత్రలో నటించగా, సాయిపల్లవి విరాటపర్వంలో నక్సలైటు పాత్రలో నటించింది.

అయితే వీరు కంటే ముందు కొంత మంది ఈ పాత్రల్లో నటించారు.మౌసమ్’లో షర్మిలా టాగూర్, ‘చాందినీ బార్’లో టబులకు జాతీయ అవార్డులు ఇచ్చారు.‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో నక్సలైటు పాత్ర చేసిన విజయశాంతి( Vijayashanti )కి అవార్డు రాలేదు.

కానీ ఈ సినిమాలో విజయశాంతి అద్భుతంగా నటించింది.అయితే ఇక్కడ ఆలియా కి ప్లస్ పాయింట్ ఉండనే చెప్పాలి.

దానికి రెండు కారణాలు ఉన్నాయి.ఆలియాకి బాలీవుడ్ సపోర్ట్ ఉంది, మరియు ఆలియా చాలా పవర్ ఫుల్.

అయితే సాయిపల్లవిని కూడా తక్కువ చేయలేం.అయితే ఈమెకు బలమైన లాబీయింగు లేదు.

అదే సాయిపల్లవికి మైనస్ అని చెప్పాలి.

తాజా వార్తలు