కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీ, ఎలుకపై ప్రయోగం

ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనా వైరస్‌.

ఈ వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సమయంలోనే పిట్స్‌ బర్గ్‌ యూనివర్శిటీ వారు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లుగా ప్రకటించారు.ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

వారి ప్రకటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కాస్త ఊరటను ఇస్తుంది.యూనివర్శిటీ వారు విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం ప్రస్తుతం ఆ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎలుకల్లో రోగ నిరోదక శక్తి పెరిగిందని వారు చెప్పారు.ఇదే వ్యాక్సిన్‌ను మనుషుల్లో వేస్తే కూడా రోగ నిరోదక శక్తి పెరుగుతుందని వారు అంటున్నారు.త్వరలోనే వ్యాక్సిన్‌ను జనాల్లోకి ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు.

Advertisement

అయితే మరో రెండు నెలల వరకు ప్రయోగాలు కొనసాగుతాయని మాత్రం అంటున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు