4వ తరగతి అర్హత ప్రభుత్వ ఉద్యోగానికి పీహెచ్‌డీ ఉన్న వారు దరకాస్తు... ఈ ప్రభుత్వాలను ఏమనాలి?

భారత దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ.

అలాగే భారతీయ యువకులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతగా తాపత్రయ పడుతున్నారో కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

రోడ్లు ఊడ్చేదైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఇండియన్స్‌ అనుకుంటున్నారు.ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే బరోసా, జీతం తక్కువగా వచ్చినా కరెక్ట్‌గా వస్తుందనేది అందరి అభిప్రాయం.

అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా చదువుతూనే ఉంటారు.చిన్న ఉద్యోగాలకు కూడా లక్షలకు లక్షలు లంచం ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తారు.అలాంటి పరిస్థితులు ఉన్న మన ఇండియాలో తాజాగా ముంబయిలోని సచ్చివాలయం క్యాంటీన్‌లో వెయిటర్‌ జాబ్‌కు దరకాస్తులు ఆహ్వానించడం జరిగింది.

13 మంది వెయిటర్‌లు సచ్చివాలయ క్యాంటీన్‌లో అవసరం ఉన్నారు.కనీసం 4వ తరగతి చదివిన వారు అర్హులు అంటూ ప్రభుత్వం ప్రకటన వచ్చింది.నాల్గవ తరగతి చదివిన వారు చేయాల్సిన ఆ ఉద్యోగంను డిగ్రీలు, ఇంజనీరింగ్‌లు, పీహెచ్‌డీలు చేసేందుకు కూడా ముందుకు వచ్చారు.

Advertisement

మొత్తంగా 7 వేల మంది ఆ ఉద్యోగం కోసం దరకాస్తు చేసుకున్నారు.ప్రైవేట్‌ రంగంలో కూడా ఉద్యోగాలు లేని కారణంగా ఒక్క ఉద్యోగానికి వెల కొద్ది పోటీ పడుతున్నారు.

ప్రభుత్వాలు ఎన్ని మారినా నిరుద్యోగుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతూనే ఉంది.సంవత్సరం సంవత్సరంకు నిరుద్యోగుల సంఖ్య ప్రమాదకరంగా మారుతోంది.ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు చేయాలి.

కాని ప్రభుత్వాలు మాత్రం తమ ప్రభుత్వంను కాపాడుకోవడానికి, అవినీతికి సమయం పడుతోంది.

మొత్తానికి నిరుద్యోగులు ఎంతో మంది మూడు పదుల వయసు వచ్చినా కూడా ఇంకా ఎలాంటి జాబ్‌ దొరకక, కొందరు చదివిన చదువుకు సంపూర్ణమైన గుర్తింపు ఉన్న జాబ్‌ దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు.మహారాష్ట్ర సచ్చివాలయంలో వెయిటర్‌ జాబ్‌ కు ఇంత మంది దరకాస్తు చేయడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు