2019 ఎన్నికల్లో ఏపీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోయేది జగనేనా.?? కొన్నేళ్లుగా అధికారం కోసం వేచి చూస్తున్న ప్రస్తుత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , త్వరలో సీఎం కుర్చీ ఎక్కబోతున్నారా.?? చంద్రబాబు ని ఏపీ ప్రజలు గద్దె దించడానికి డిసైడ్ అయ్యారా అంటే, గత కొంతకాలంగా రాజకీయ పరిశీలకులు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు.అయితే కొన్ని సర్వేలు సైతం జగనే సీఎం అనేట్టుగా తమ తమ సర్వే రిపోర్ట్ లు బయటపెడుతూ ఏపీలో హీట్ రేపుతున్నారు.
కానీ.సర్వేలలోనే టాప్ సర్వే గా పేరొందిన రిపబ్లిక్ టీవీ-సీ, తానూ తాజాగా చేసిన సర్వేలో సైతం జగనే సీఎం అనే వాదన వినిపించింది దాంతో ఒక్క సారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది.
ఈ సర్వే వివరాలలోకి వెళ్తే.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టబోయేది జగన్ రెడ్డి నే అంటూ వైసీపీ కార్యకర్తల్లో ,పార్టీలో ఊపు వచ్చేలా రిపబ్లిక్ సర్వే తన రిపోర్ట్ ని వెల్లడించింది.ఈ సర్వేని రిపబ్లిక్ – సీ ఓటర్ రెండూ సంయుక్తంగా నిర్వహించాయి.
నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలను ఏపీలో సంచలనం సృష్టించాయి.
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ఘోరమైన పరాభవం ఎదుర్కోబోతోందని ఈ సర్వే తెలిపింది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఏపీలో 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 19 సీట్లు, టీడీపీకి 6 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే తెలిపింది.

ఇదిలాఉంటే జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకి ఏపీలో ఒక్క స్థానం కూడా వచ్చే అవకాసం లేదని తేచి చెప్పింది.ఓట్ల శాతం పరిశీలించినా సరే వైసీపీ దే పైచేయిగా కనిపిస్తోంది.వైసీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.గత ఎన్నికల్లో ఫలితాలు పరిశీలిస్తే .2014 లోక్ సభ ఎన్నికల్లో తెలుగు దేశం , బీజేపీ కలిసి పోటీ చేస్తే టీడీపీకి 15, బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి కాని ఆ సమయంలో వైసీపీకి దాదాపు 8 స్థానాలు వచ్చాయి.ఈ సర్వే అంచనాలని టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నా ఏపీలో ఇప్పుడు వైసీపీ హవా కొనసాగుతుందని అంటున్నారు విశ్లేషకులు సైతం.







