అయ్య బాబోయ్‌... గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పేలింది!

న్యూఢిల్లీ

దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి భ‌గ్గుమ‌న్నాయి.వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను పెట్రోలియం కంపెనీలు 25 రూపాయల మేర‌కు పెంచాయి ఫ‌లితంగా సబ్సీడీయేతర సిలిండర్ ధర 884.

50 రూపాయ‌ల‌కు చేరింది.ఈ నూత‌న‌ రేట్లు సెప్టెంబ‌రు ఒక‌టి నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి.19 కిలోల క‌మ‌ర్షియ‌ల్ సిలిండర్ ధర 75 రూపాయల మేర‌కు పెరిగింది.ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయ‌ల వైపు వేగంగా పరుగులు తీస్తోంది.

కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలో గ్యాస్ సిలిండర్ ధర మరోమారు పెరిగింది.ఆగస్ట్ రెండో వారం అనంత‌రం గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయ‌ల మేర‌కు పెరిగింది.

తాజాగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర మరో 25 రూపాయ‌ల మేర‌కు పెరిగింది.ఇంత‌వ‌ర‌కూ హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర 912.00 గా ఉంది.ఇక‌పై గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే 937 రూపాయ‌లు చెల్లించాల్సిందే.

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయ‌లు పెర‌గాలంటే మ‌రో 63 రూపాయ‌లు పెరిగితే స‌రిపోతుంది.దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ 884.50 రూపాయ‌ల‌కు చేరుకుంది.డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరతో పాటు కమర్షియల్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 75 రూపాయ‌ల మేర‌కు పెర‌గ‌డంతో హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1,872 రూపాయ‌ల‌కు చేరుకుంది.ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1693 రూపాయ‌లుగా ఉంది.

Advertisement

కాగా కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధరలు త‌ర‌చూ పెరుగుతున్నాయి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు