వైరల్: రూ.లక్షన్నర మాయం.. కొంపముంచిన కుక్క..!

మనం ఇంట్లో కుక్కలను పెంచుకోవడం చూస్తుంటాం.

ఏదైనా ఒక వస్తువును విసిరేస్తే కుక్క మళ్ళీ ఆ వస్తువుని తన యజమాని దగ్గరకు తీసుకుని రావడం కూడా ఎన్నో సందర్భాల్లో చూసాం.

కానీ వీటన్నింటికి భిన్నంగా ఒక కుక్క ఏకంగా లక్షన్నర రూపాయల డబ్బును ఎత్తుకుని పోయింది.దీంతో ఆ కుక్కను పెంచుకున్న యజమాని ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

మనం పెంచుకుంటున్న కుక్కే కదా ఏం చేస్తుందిలే అనుకుంటే.కొంప ముంచేసిందంటూ యజమాని లబోదిబోమంటున్నారు.

ఆ పట్టుకెళ్లిన డబ్బులు ఎక్కడ పడేసిందో అంటూ వెతుకులాట మొదలుపెట్టారు.ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

వివరాల్లోకి వెళ్తే.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో చేరాలు అనే వ్యక్తి గొర్రెలను కాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

గొర్రెలకు కాపలా కోసం ఒక కుక్కను కూడా పెంచుకుంటున్నాడు.అందులో భాగంగా ఒక గొర్రెను అమ్మి.

అమ్మగా వచ్చిన డబ్బును తన నడుముకు కట్టుకున్నాడు.స్నానానికి వెళ్తూ.

ఎప్పటిలాగే తన నడుంకు కట్టుకున్న డబ్బుల సంచిని ఓ పక్కన పెట్టి స్నానానికి వెళ్ళాడు.వచ్చి చూసే సరికి తన పెంపుడు కుక్క, డబ్బు మూట రెండూ కనపడలేదు.తన యజమాని దాచుకున్న రూ.1.50 లక్షల నగదు సంచిన ఎత్తుకెళ్ళి ఎక్కడో పడెసింది.చేరాలు పెంచుకుంటున్న తన పెంపుడు కుక్కకు నోటికి అందిందల్లా ఎత్తుకెళ్లి ఎక్కడెక్కడో పడేస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఆ అలవాటు ప్రకారమే పైసలు కట్టి ఉన్న సంచిని ఎత్తుకెళ్లింది.

Advertisement

అయితే ప్రస్తుతం ఆ డబ్బు సంచిని కుక్క ఎక్కడ విడిచి పెట్టిందో అంతు చిక్కడం లేదు.ఆ డబ్బు కోసం ఇంటిల్లిపాది గ్రామం అంతా గాలించినా ఫలితంలేదు.దాంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.

దీంతో కుక్క వెళ్లిన ప్రతీ చోటా గాలిస్తున్నారు.పెంపుడు కుక్క చేసిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాట్సప్ గ్రూప్ ధ్వారా కూడా గ్రామంలో అందరికి ఈ వార్తను తెలిసేలా చేసినా ఫలితం దక్కలేదు.దింతో తలపట్టుకొని కూర్చున్న యాజమాని ఆ కుక్కను బుజ్జగించే పనిలో పడ్డారు.

తాజా వార్తలు