ప్రజల సమస్యలను పరిష్కరించాలి:నెల్లికంటి

నల్లగొండ జిల్లా:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులైన వెల్మకన్య ఫీడర్ ఛానల్,శేసిలేటి వాగు ఫీడర్ ఛానల్ నిర్మాణం పనులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని సీపీఐ నల్లగొండ జిల్లా(CPI Nalgonda District) కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ చండూరు మండల నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.

రేవంత్ రెడ్డి (Revanth reddy)ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్న కనీసం నిరుపేదలకు రేషన్ కార్డులు,ఆసరా పెన్షన్స్ ఇవ్వలేకపోయారన్నారు.ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదవారందరికీ నూతన రేషన్ కార్డులు,అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం,ఆసరా పెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయుటకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.మండల పార్టీ కార్యవర్గ సభ్యుడు తిప్పర్తి రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య,మండల పార్టీ కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బరిగెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ ఆర్ఓఆర్- 2024...రంగంలోకి నవీన్ మిట్టల్
Advertisement

Latest Vizag News