కరోనా ను కేర్ చేయకపోతే ఎలా ?  జనాల్లో ఏంటి ఈ నిర్లక్ష్యం ?

ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా, ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

గత ఏడాది వచ్చిన మొదటి వేవ్ కరోనా కంటే, ఈ రెండో వేవ్ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా, పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నా,  జనాల్లో మాత్రం గత ఏడాది వచ్చినంత స్థాయిలో అయితే చైతన్యం వచ్చినట్లు కనిపించడం లేదు.

ఈ రెండో దశ కరోనాను జనాలు పెద్దగా పట్టించుకోనవసరం లేదు అనుకుంటున్నారో, లేక గత ఏడాది నుంచి ఉన్నదే కదా అన్నట్లుగా నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు గానీ, పెద్దగా నిబంధనలు అయితే పాటిస్తున్నట్లు గా కనిపించడం లేదు.కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు.

మరికొన్నిచోట్ల ఆంక్షలు విధించారు.అయితే లాక్ డౌన్ లో భాగంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం వరకు జనాలకు బయట తిరిగేందుకు అవకాశం కల్పించారు.

అదే సమయంలో పెద్ద ఎత్తున జనాలు రోడ్లపైకి రావడం, గుంపులుగుంపులుగా తిరుగుతుండడంతో మార్కెట్లు , వ్యాపార కేంద్రాల వద్ద భారీ స్థాయిలో జనం గుమిగూడి ఉండడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను జనాలు పెద్దగా పట్టించుకోనట్టుగానే కనిపిస్తున్నారు.

Advertisement

మొదటి సారి లాక్ డౌన్ విధించిన సమయంలో షాపుల ముందు గీతలు గీసి, నిర్ణీత దూరం లో జనాలు ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకునేవారు.తరచుగా శానిటైజర్ ఉపయోగిస్తూ, జనాలు భయం భయంగానే రోడ్లపైకి వచ్చేవారు.

అయితే ఇప్పుడు మాత్రం అటువంటి నిబందనలు, జాగ్రత్తలు కానీ కనిపించడం లేదు.ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగానే లాక్ డౌన్ వెసులుబాటు సమయంలో జనాలు కనిపిస్తున్నారు.

మాస్కులు ధరిస్తున్నా చాలామంది వాటిని నోటి కి మాత్రమే కొంతమంది పరిమితం చేస్తున్నారు.రెండో దశ కరోనా శరవేగంగా దూసుకు వస్తున్నా, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా, జనాలు లైట్ తీసుకుంటున్నట్టు గానే వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా , జనాల్లో మార్పు రాకపోతే మరెన్నో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు