కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే సంసారానికి పనికి రామంటూ ఏకంగా....

ఈ మధ్యకాలంలో కొందరు అవగాహన లేకుండా ఆలోచిస్తూ చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు.కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టగా ఆ గ్రామంలో మాత్రం కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తీసుకుంటే సంసారానికి పనికి రాకుండా పోతా మంటూ వ్యాక్సిన్ ని తీసుకునేందుకు నిరాకరిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 People Corona Vaccine Refusal In Utter Pradesh, Utter Pradesh, Corona Vaccine, C-TeluguStop.com
Telugu Corona Vaccine, Corona, Coronavaccine, Saraiya River, Utter Pradesh-Lates

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బారాబంకి గ్రామంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్యాధికారులు సన్నాహాలు చేస్తుండగా గ్రామంలోని కొందరు యువకులు కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటే సంసారం చేసేందుకు పనికి రాకుండా పోతారనే అపోహతో తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.అంతేకాకుండా తమకు వ్యాక్సిన్ ఇవ్వొద్దంటూ గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి సరయూ నదిలో దిగి నిరసన కూడా చేపట్టారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.అయితే ఈ గ్రామంలో పురాతన జాతులకు చెందినటువంటి తెగ ప్రజలు నివసిస్తున్నారని వీళ్లు తమ పూర్వీకులు నేర్పించిన ఆచారాలను సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తారని అందువల్లనే కొంతమేర సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా బతుకుతున్నారని కొందరు చెబుతున్నారు.

ఈ కారణాల వల్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ పై లేనిపోని అపోహలు కారణంగా వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారట.

Telugu Corona Vaccine, Corona, Coronavaccine, Saraiya River, Utter Pradesh-Lates

దీంతో ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతోగ్రామస్తుల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వ అధికారులు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయినట్లు సమాచారం.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానం తో దేశం ముందుకు సాగుతున్నప్పటికీ దేశంలోని పలు గ్రామాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు, వింత ఆచారాలు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కాబట్టి వాటిని రూపుమాపేందుకు దృష్టి సారించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube