IPL 22: బౌలింగ్ సమయంలో హెడ్ మాస్క్ పెట్టుకొని చేసిన పంజాబ్ కింగ్స్ బౌలర్! దాని వలన ఉపయోగాలు ఇవే!

IPL 22 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ వింతలు విశేషాలకు వేదికగా మారుతుండటం గమనార్హం.చెన్నై సూపర్ కింగ్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బౌలర్ రిషి ధావన్ హెడ్ మాస్క్ తో బౌలింగ్ చేసి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు.

అరోరా స్థానంలో పంజాబ్ కింగ్స్ తుది జట్టులోకి వచ్చిన రిషి ధావన్.5వ ఓవర్ వేయడానికి బౌలింగ్ కు వస్తూ, హెల్మెంట్ లాంటి దానిని తన తలకు ధరించి బౌలింగ్ చేశాడు.దాంతో అందరు అతనివంక ఆశ్చర్యంగా చూడసాగారు.

దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ గ్లాస్ హెడ్ మాస్క్ తల, ముక్కు వంటి బాగాలను కవర్ చేసి వుంది.

బంతి వేగంగా వచ్చి బౌలర్ కు తగిలినా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇది నివారిస్తుంది.అయితే ఇండియాలో ఒక బౌలర్ హెడ్ మాస్క్ వాడటం కొత్త అయినప్పటికీ ఇతర దేశాల్లో ఇటువంటి మాస్క్ లు వాడటం కామన్.2018లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన దేశవాళీ టోర్నీలో వారెన్ కూడా ఇటువంటి మాస్క్ నే ధరించి బౌలింగ్ చేశాడు.దానిని మాస్క్ అని అనడం కంటే కూడా హెల్మెంట్ అంటే బాగుంటుందేమో అని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇటువంటి హెడ్ మాస్క్ లను మనం ఎక్కువగా ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ క్రీడల్లో మనం చూడవచ్చును.

Pbks Bowler Rishi Dhawan Wears A Head Mask While Bowling Vs Csk
Advertisement
Pbks Bowler Rishi Dhawan Wears A Head Mask While Bowling Vs Csk-IPL 22: బౌ�

ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిప్ హ్యూజ్ మరణం తర్వాత అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు తమ రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధను చూపడం మనం గమనించవచ్చు.బ్యాటింగ్ చేసేవారు హెల్మెట్ ధరించిన మాదిరిగానే బౌలర్లు కూడా హెల్మెట్ ధరిస్తే బావుంటుందని కొందరు సూచిస్తున్నారు.ఒకవేళ బ్యాటర్ స్ట్రయిట్ గా కొట్టిన సమయంలో దాదాపు 100 కుపైగా కి.మీ వేగంతో బంతి వచ్చి బౌలర్ ను తగిలే అవకాశం ఉంటుంది.కాబట్టి బౌలర్ కూడా హెల్మెట్ ధరించవచ్చని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి భరత్ బౌలర్లు కూడా ఇలాంటి పరికరాలను వాడటం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు