ఏంటో... ఈవిడ రూటే సపరేటు.. మిడిల్ ఫింగర్ చూపిస్తూ పాయల్ రాజ్ పుత్ వీడియో!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన పోస్టులతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది.పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.

Advertisement

ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

దీంతో ఇకపై తనకు సినిమా అవకాశాలు రావని అనుకున్నారు.కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది.

నిత్యం ఫోటో షూట్లతో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా తెలుపుతుంది.గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఆ విషయం బాగా వైరల్ గా మారింది.ఇక అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను.

Advertisement

అతని తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.

ఇక ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.అందులో ర్యాప్ సింగర్ సిద్దు మూసేవాలా మరణించిన సంగతి తెలిసిందే.

ఇక ఈయనఅభిమాని అయిన పాయల్ ప్రియుడు సౌరబ్ దింగ్రా స్వయంగా కొన్ని ర్యాప్ లిరిక్స్ రాసాడు.పాటలు కూడా పాడారు.

ఇక ఆ పాటనే పాయల్ రాజ్ పుత్ లిప్ మూమెంట్ ఇస్తూ రీల్ చేసింది.ఆ వీడియో అంతా బాగానే ఉన్నా కూడా చివర్లో తనను మిడిల్ ఫింగర్ చూపించటంతో ప్రస్తుతం అది బాగా చర్చగా మారింది.ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు ఏంటో.

ఈవిడ రూటే సపరేటు.మిడిల్ ఫింగర్ చూపించడం ఏంటి అంటూ కామెంట్ చేసాడు.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతుంది.టాలీవుడ్ లో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తెగ అవకాశాలు అందుకుంటుంది.

ప్రస్తుతం ఆమె ఖాతాలో సినిమాలు లైన్ గా ఉన్నాయి.ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

అంతేకాకుండా ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి వరస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలలో ఎటువంటి సక్సెస్ లను అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు