ఈ ఫొటోలో కనిపిస్తున్న తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన "ఆర్ఎక్స్ 100" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకుని తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొట్టిన తెలుగు ప్రముఖ హీరోయిన్ "పాయల్ రాజ్ పుత్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ అమ్మడుకి ఎక్కువగా గ్లామర్ కి సంబంధించిన పాత్రలు తలుపు తట్టడంతో తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి పెద్దగా స్కోప్ లేకపోయింది.

దీంతో ఆఫర్ల పరంగా పాయల్ రాజ్ పుత్ బాగానే సంతృప్తి చెందినప్పటికీ తన కెరియర్ లో సరైన హిట్ లేక సతమతమవుతోంది.దీంతో ఈ మధ్యకాలంలో పాయల్ రాజ్ పుత్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

అంతేకాకుండా అందానికి ప్రాధాన్యత కాకుండా తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఉన్నటువంటి పాత్రలను ఎంచుకుంటోంది.అయితే ఈ మధ్య కాలంలో పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పలు ఫోటో షూట్లలలో దిగిన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది.

కాగా ఇటీవలే పాయల్ రాజ్ పుత్ అందమైన ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.అంతే కాకుండా ఈ ఫోటోకి ఇది మేకప్ వేసుకుని అందంగా కనిపించాల్సిన సమయం అని క్యాప్షన్ కూడా పెట్టింది.

Advertisement

దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.అయితే ఓ నెటిజన్ తన పుట్టిన రోజు అని కామెంట్ రూపంలో పాయల్ రాజ్ పుత్ కి తెలియజేయడంతో వెంటనే ఈ అమ్మడు తన అభిమానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇది గమనించిన కొందరు నెటిజన్లు "లక్కీ ఫ్యాన్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలె పాయల్ రాజ్ పుత్ "అనగనగా ఓ అతిథి" అనే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అయిన "ఆహా" ఓటిటి లో విడుదల చేయగా ప్రేక్షకులని బాగానే అలరించింది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న "ఏంజెల్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ తమిళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

అలాగే ఇటీవలే కన్నడ భాషకు చెందిన ఓ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు