సీనియర్ హీరోలతో రొమాన్స్ చేస్తా అంటున్న పాయల్ రాజ్ పుత్  

బాలకృష్ణతో రొమాన్స్ చేయబోతున్న పాయల్ రాజ్ పుత్.

Payal Rajput Ready To Romance With Senior Hero\'s-romance With Senior Hero\\'s,telugu Cinema,tollywood

నార్త్ ఇండియా నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతో ఎక్స్ పోజింగ్, రొమాన్స్ విషయంలో తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని టాలీవుడ్ దర్శకులకి ఆఫర్ ఇచ్చిన ఈ భామ టాలెంట్ కి మన దర్శకులు ఫ్లాట్ అయిపోయారనే చెప్పాలి. అందుకే పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు..

సీనియర్ హీరోలతో రొమాన్స్ చేస్తా అంటున్న పాయల్ రాజ్ పుత్-Payal Rajput Ready To Romance With Senior Hero's

అటు గ్లామర్, ఇటు నటనని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసే హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇలాంటి టైంలో ఆర్ ఎక్స్ భామ ఎంట్రీ అందరికి మంచి ఛాయస్ గా మారింది. దీంతో ఊహించినట్లుగానే రెండో సినిమానే మాస్ మహారాజ్ రవితేజతో చేసే అవకాశాన్ని ఈ పంజాబీ భామ సొంతం చేసుకుంది.

డిస్కో రాజాలో మెయిన్ హీరోయిన్ గా పాయల్ అవకాశం పట్టేసింది. ఇక ఊహించని విధంగా వెంటనే బాబి దర్శకత్వంలో వెంకి మామా సినిమాలో వెంకటేష్ తో రొమాన్స్ చేయడానికి కూడా పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

వీటితో పాటు మరో యువ దర్శకుడుకి కూడా పాయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి లిస్టు లో ఉండగానే ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అవకాశం కొట్టేసినట్లు తెలుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మరో రెండు రోజులలో తెలిసే అవకాశం ఉంది అని చెప్పాలి.