పవన్ కళ్యాణ్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వెనుక నుంచి అలా రావడంతో?

సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వెళ్ళినప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.ఎందుకంటే వారి అభిమానులు సెల్ఫీల కోసం ఆటోగ్రాఫ్ ల కోసం ఎగ పడుతూ ఉంటారు.

ఇక సెక్యూరిటీ లేకుండా పబ్లిక్ లోకి సెలబ్రెటీలు వెళితే ఇక అంతే సంగతులు.మామూలుగానే సెలబ్రిటీలకు బాడీగార్డులు ఉన్న తోపులాటలు జరుగుతూ ఉంటాయి.

అలాంటిది ఒంటరిగా వెళితే ఎలా ఉంటుందో తెలిసిందే.ఒక్కొక్కసారి సెలబ్రిటీలు సహనాన్ని కోల్పోయి అరవడం, కొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.

ఇక పోతే పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన అత్యుత్సాహం ఏకంగా పవన్ కళ్యాణ్ కింద పడేలా చేసింది.పవన్ కళ్యాణ్ కొద్దిలో పెను ప్రమాదం నుండి తప్పించు కున్నాడు.

Advertisement

లేకపోతే పవన్ కళ్యాణ్ కారు నుంచి కింద పడి పోయేవారు.అసలేం జరిగిందంటే.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల చెరువుల పై మత్స్యకారుల అధికారులు తొలగించేలా వారి ఉపాధి దెబ్బతీసే విధంగా 217 జీవోను జారీ చేసింది.ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో పై మత్స్యకారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల సొసైటీల పేరుతో చేపల చెరువులన్నీ దళారీల చేతిలో ఉన్నాయని అందువల్లే 217 జీవో ద్వారా వేలం వేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.కానీ మత్స్యకారుల మాత్రం ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మత్స్యకారుల కోసం రంగంలోకి దిగారు.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించగా, అభ్యున్నతి సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో మత్స్యకారుల సమస్యల పరిష్కారంపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి అని నిర్ణయించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఈ సభ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే అతనికి అభిమానులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.ఇక అక్కడి నుంచి రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకున్నారు.నర్సాపురం లో జరిగే సభకు పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఇక అప్పుడు కారులో నుంచి అభివందనం చేస్తూ అందరికీ కల్పించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కారు ఎక్కాడు.ఈ క్రమంలోనే ఒక అభిమాని కారు పైకి ఎక్కి పవన్ కళ్యాణ్ ను కౌగలించుకోడానికి ప్రయత్నించగా అప్పుడు పవన్ కళ్యాణ్ కింద పడి పోయే పరిస్థితి కనిపించింది.

అలా తృటిలో పవన్ కళ్యాణ్ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఊహించని విధంగా పరిణామాలు జరగడంతో పవన్ కళ్యాణ్ కొన్ని క్షణాల పాటు కారులోనే ఉండిపోయారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు