హమ్మయ్య.. ఎట్టకేలకు కోర్టుకెళ్తున్న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పనులు మెజారిటీ శాతం ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఇప్పటికే అందరిలో మొదలైంది.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ ఏర్పడింది.

అయితే ఈ సినిమా షూటింగ్‌లో చాలా తక్కువ భాగం మిగిలి ఉండటంతో ఈ షూటింగ్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారా అని అందరూ అనుకుంటున్నారు.కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా ప్రభావంతో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ ఉంటుందో లేదో అనే నిర్ధారణకు వచ్చేసారు జనం.అయితే అందరికీ షాకిస్తూ ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసేయానలి భావిస్తున్నాడట.

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, పవన్ సరసన ఓ స్టార్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Advertisement
జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?

తాజా వార్తలు