పవన్ 8 ఇస్తే చాలట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని పవన్ తెలుగులో వకీల్ సాబ్ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ తొలుత అనుకున్నారు.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు పవన్ మరో 8 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని చిత్ర యూనిట్ అంటోంది.ఈ 8 రోజుల షూటింగ్ పూర్తిచేస్తే చిత్ర షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

Advertisement

మొత్తానికి వకీల్ సాబ్ కోసం పవన్ మరో 8 రోజులు కేటాయిస్తే సరిపోతుందని తెలుస్తోంది.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)
Advertisement

తాజా వార్తలు