Pawan kalyan vijayanagaram tour: ఒక్క అవకాశం అంటూ విజయనగరం పర్యటనలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు.జిల్లాలో గుంకలంలో జగనన్న కాలనీలో పర్యటించడం జరిగింది.

ఇళ్ల నిర్మాణం సరిగ్గా సాగటం లేదని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇల్లు కేటాయింపుల విషయంలో భూసేకరణకు సంబంధించిన అవినీతి జరిగిందని ఆరోపించారు.జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

మెరుగైన భవిష్యత్తు కోసం.గుండాలతో పోరాడుతున్నాను.

Advertisement

యువత మీ భవిష్యత్తు కోసం ముందుకి రండి పోరాటం చేద్దాం.మార్పు ఏమిటో చూపిస్తాను అని పేర్కొన్నారు.

అవినీతిపై రాజీలేని పోరాటం చేద్దాం.అవినీతి రహిత ప్రభుత్వం తీసుకొద్దాం.

రాష్ట్రంలో రోడ్లు వేయలేని వైసిపి మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తుంది అంటూ సెటైర్లు వేశారు.ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇదే సందర్భంలో ఉత్తరాంధ్ర జనసైనికులు ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడవద్దని, కేసులు పెడితే తాను కూడా వస్తానని తెలిపారు. మెరుగైన భవిష్యత్తు కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని మార్పు అంటే ఏమిటో చూపిస్తాను అని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు