Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోబలి స్క్రిప్ట్ మార్చి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీశారా.. పవన్ తప్పు చేశాడంటూ?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని మరొక హీరో చేయడం, ఆ సినిమా హిట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.

అలాగే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథని మరొక హీరో చేసి ఫ్లాప్ అయిన సినిమాలు అలాంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.కాగా ఒక స్టార్‌ హీరో, టాప్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అవ్వడం వెనుక ఎన్నో డిస్కషన్స్‌ జరుగుతాయి.

ఒక హీరోకి నచ్చిన కథ మరో హీరోకి నచ్చకపోవచ్చు.అలాగే ఒక హీరో రిజెక్ట్‌ చేసిన కథ మరో హీరోకి నచ్చవచ్చు.

ఇండస్ట్రీలో ఏదైనా జరుగుతుంది.

Advertisement

అలా ఒక కథ విషయంలో పవన్‌ కల్యాణ్‌కి ( Pawan kalyan )ఈ అనుభవం ఎదురైంది.టాలీవుడ్‌లోనే టాప్‌ డైరెక్టర్‌ గా పేరున్న త్రివిక్రమ్‌( Trivikram Srinivas ) జల్సా సినిమా చేస్తున్న సమయంలో ప్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో పవన్‌తోనే ఒక సినిమా చెయ్యాలని ప్లాన్‌ చేసుకున్నాడు.అందుకోసం ఫ్యాక్షనిజం పై రీసెర్చ్‌ చేసి పక్కా స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు.

కోబలి అనే టైటిల్‌తో ఆ సినిమా చెయ్యాలనుకున్నాడు.కానీ, ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు.

తర్వాత అదే ఫ్యాక్షనిజం బ్యాక్‌ డ్రాప్‌లో ఎన్టీఆర్‌ హీరోగా అరవింద సమేత వీర రాఘవ( Aravinda Sametha Veera Raghava ) చేశాడు.అది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది.

పవన్‌ కళ్యాణ్‌తో అనుకున్న కోబలి కథనే మార్చి అరవింద సమేత చేశాడని ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఏ సందర్భం వచ్చిందో తెలీదుగానీ ఇప్పుడు ఆ పాత న్యూస్‌ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.ఈ విషయం తెలుసుకున్న పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ చాలా ఫీల్‌ అవుతున్నారు.

Advertisement

ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికీ వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈయన చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

అందులో రెండు సినిమాలు ఇప్పటికే కొంతమేర షూటింగ్ ని కూడా జరుపుకున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఆ సినిమా నిర్మాతలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అలాగే పవన్ సినిమాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు