Modi Pawan Kalyan : విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంకి చేరుకున్నారు.ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా విశాఖ విమానశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పవన్ కళ్యాణ్.వాహనంలో నేరుగా నోవాటెల్ హోటల్ కి బయలుదేరడం జరిగింది.ఈ సందర్భంగా ప్రధాని మోడీతో రాష్ట్ర రాజకీయాలు ఇంకా అనేక విషయాలకు సంబంధించి దాదాపు 5 పేజీల నోట్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ప్రధానంగా ఈ భేటీలో బిజెపితో పొత్తుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.2014 ఎన్నికల సమయంలో మోడీతో కలిసి పవన్ ప్రచారంలో పాల్గొన్నారు.ఆ సమయంలో మోడీ గెలిచిన తర్వాత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది.

అప్పటినుండి ఇద్దరు ఎప్పుడూ కూడా భేటీ కాలేదు.అయితే చాలా కాలం తర్వాత మోడీతో ఇప్పుడు పవన్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు