వరుణ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా కుర్ర హీరోలతో సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాడు.

గబ్బర్ సింగ్ సినిమానే తానే నిర్మించాలని అనుకున్నారు అయితే అది వర్క్ అవుట్ కాలేదు.తరువాత గబ్బర్ సింగ్ 2కి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

Pawan Kalyan Produce Varun Tej Movie, Tollywood, Telugu Cinema, Mega Heroes, Kis

అయితే ఇకపై పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో తన సినిమాలు కాకుండా యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నారు.గతంలో రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మించాలని అనుకున్నారు.

అయితే కథ ఫైనల్ కాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.అయితే ఈ సారి తనకి అత్యంత సన్నిహితుడు అయినా డైరెక్టర్ కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

పవన్ కళ్యాణ్ గతంలో ఈ దర్శకుడుతో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేశారు.తరువాత మరో సినిమా చేద్దామని అనుకున్నారు.

ఈ లోపే ఎన్నికలు సమీపించడంతో అది సెట్ అవ్వలేదు.అయితే ఇప్పుడు కిషోర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయిందనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ చెబుతున్నారు.అతనికి ఈ సినిమాతో సక్సెస్ అందించి దర్శకుడుగా గుర్తింపు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు బోగట్టా.

వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ మూవీ చేస్తున్నాడు.దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఈ రెండు పూర్తయిన తర్వాత కిషోర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నిర్మాణంలో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు