జగన్ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ సీరియస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల కారణంగా.ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Is Serious About Jagan Government Pawan Kalyan, Nadendla Manohar, Y-TeluguStop.com

ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు కడప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.వాగులు.

నదులు చెరువులు పొంగి పొర్లుతూ ఉండటంతో.ఇల్లు కూడా కోట్టుకెళ్ళి పోతున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే.వరద నీళ్లు వల్ల ఇల్లు కాలనీలు లోతట్టు ప్రాంతాలలో.

కట్టుబట్టలతో సహాయ శిబిరాలకు చేరుకుంటున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా ఇసుక విక్రయానికి సంబంధించి పత్రికల్లో.

పెద్ద ఎత్తున ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందిస్తూ.

ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటూ సీరియస్ అయ్యారు.

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రజలు.

అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం మాత్రమే కాక వారి ఇల్లు.పశువులు.

పంటలు కొట్టుకుపోతున్నాయి.ప్రాణాలు కోల్పోతున్నారు.

పంట పొలాలు మునిగిపోతూ ఉండటంతో రైతులు ఏడుస్తున్నారు.ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఇసుక అమృతమని ప్రకటన ఇవ్వటం ఏమిటి అని పవన్ ప్రశ్నించారు.

ఇదే తరుణంలో జనసేన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించి.ఇసుక ప్రకటనపై సీరియస్ అయ్యారు.

జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్లు, పశు సంపద, సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటన ఏమిటి ?అని ప్రశ్నించారు.వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా నీరోతత్వం ఒంటబట్టిందా ? ఈ అడ్వర్టైజ్మెంట్ అవసరమా ? జగన్ గారూ అని ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube