టీఆర్ఎస్ లో 'దళిత బంధు ,' మంటలు ? కేసీఆర్ పై అసంతృప్తి ?

హుజురాబాద్ ఎన్నికల్ల గెలిచేందుకు కేసీఆర్ పెద్ద తారక మంత్రమే వేశారు.

ఇక్కడ గెలుపుపై అనుమానాలు ఉండటంతో, ఏదోరకంగా ఈటెల రాజేందర్ ను ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రకటించారు.

ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దళిత ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు, అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇస్తామంటూ కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు.దీనిని నేడు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ పథకాన్ని హుజురాబాద్ వరకు మాత్రమే పరిమితం చేస్తే, మిగతా ప్రాంతాల్లో టిఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది అనే విషయాన్ని గ్రహించిన కేసీఆర్ రాష్ట్రమంతా ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించారు.దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అసలు కుటుంబానికి 10 లక్షలు చొప్పున తెలంగాణలోని దళిత కుటుంబాలకు ఈ దళిత బంధు పథకం ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా, దీనికి అవసరమైన సొమ్ములు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు ఎన్నో వ్యక్తమైనా, కేసీఆర్ మాత్రం దానిని అమలు చేస్తామని గట్టిగానే ప్రకటించారు.అంతేకాదు తన దత్తత గ్రామం అయిన నల్గొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో కెసిఆర్ ఈ పథకాన్ని అమలు చేశారు.

Advertisement

ఈ రోజు నిర్వహించే సభలో దళిత బంధును అధికారికంగా ప్రకటించనున్నారు.అయితే ఈ పథకం ద్వారా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.అయితే ఇది ఎంత క్రెడిట్ అయితే టిఆర్ఎస్ కు తీసుకు వస్తుందో అంతకంటే ఎక్కువగా నష్టాన్ని కలిగించబోతోంది అనే విధంగా తయారయ్యింది.

ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది.మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయని, భారీ ఎత్తున ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తింది.

హుజురాబాద్ వరకే ఈ పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తే, మిగిలిన చోట్ల ఘోరంగా దెబ్బతినాల్సి వస్తుందని, అసలు దళిత బంధు పథకం ద్వారా కుటుంబానికి 10 లక్షలు ఇమ్మని ఎవరు అడిగారని, కుటుంబానికి రెండు లక్షలు చొప్పున తెలంగాణ అంతటా ఈ పథకాన్ని అమలు చేస్తే, ఆ క్రెడిట్ వేరేగా ఉండేదని, ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయలేక చతికిలబడితే టిఆర్ఎస్ ఘోరంగా దెబ్బ తినేందుకు ఈ పథకం కారణమవుతుందనే అసంతృప్తి పార్టీ నాయకుల్లోనూ, ఎమ్మెల్యేల్లోనూ వ్యక్తమవుతోంది.అనవసరంగా కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రభుత్వానికి, తమకు ఈ పథకం శాపంగా మారబోతుందనే ఆందోళనలు టిఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు