ఇప్పటికి ఆమెను చూస్తే భయపడుతున్న పరుచూరి గోపాల కృష్ణ

విజయలలిత.లేడీ జేమ్స్ బాండ్ గా గుర్తింపు పొందిన నటీమణి.

తను నటించిన రౌడీరాణి ఆమెకు కనీవినీ ఎరుగని రీతిలో పేరు తెచ్చి పెట్టింది.

అద్భుతమై ఫైట్లతో పాటు డ్యాన్సులు కూడా చేసేది ఈ నటీమణి.

అందుకే తనకు లేడీ జేమ్స్ బాండ్ అనే పేరు వచ్చింది.తాజాగా ఈమెకు సంబంధించిన పలు విషయాలను ప్రముఖ సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించాడు.

పరుచూరి పలుకులు పేరుతో ఆయన చేసే ఓ షోలో ఆమె గురించి చెప్పాడు.విజయ లలిత గురించి తనకు చిన్నప్పటి నుంచే తెలుసు అని చెప్పాడు.

Advertisement

విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తన సినిమాలను చూసి పెరిగినట్లు వెల్లడించాడు.ఆమె నటించిన రౌడీ రాణి సినిమా ఎన్నిసార్లు చూసినా.

మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేదని చెప్పాడు.అప్పట్లోనే తనను సౌత్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా పిలిచే వారని వెల్లడించాడు.

తను ఫైట్లు బాగా చేయడంతో పాటు డ్యాన్సులు కూడా అద్భుతంగా చేసేదని చెప్పాడు.జ్యోతి లక్ష్మి, జయమాలిని రాకముందు నుంచే ఈ అద్భుతంగా డ్యాన్స్ చేసేదన్నాడు.

ఆమె డ్యాన్సుకు థియేటర్లలో కుర్రకారు కేరితంలు కొట్టేవారని చెప్పాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!

గూఢచారి 116లో జేమ్స్‌ బాండ్‌గా కృష్ణ ఎంత పేరు తెచ్చుకున్నాడో.విజయలలితకు కూడా అంతే పేరు ఉండేదని చెప్పాడు.ఆమె నటించిన మదర్‌ ఇండియా, చినరాయుడు, జైలర్‌ గారి అబ్బాయి, సాహసవీరుడు సాగరకన్య తనకు బగా గుర్తున్నాయని చెప్పాడు.

Advertisement

తాము రాసిన సినిమాల్లో ఈ సినిమాలు చాలా విభిన్నమైనవని వెల్లడించాడు.మదర్ ఇండియా సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గర జరిగింది.ఆరోజు షూటింగ్ లో పాల్గొన్నా.

అందులో తాను భీముడి పాత్ర పోషించినట్లు చెప్పాడు.అందులో తాను ఓ డైలాగ్ చెప్పానని.తెలిసో.

తెలియకో.మా నాన్న నాకు భీముడు అని పేరు పెట్టారు.

తెలిసో తెలియకో మీ నాన్న నీకు దుర్యోధనుడు అని పేరు పెట్టారు.పేరు పెట్టిన రోజునే నా చేతిలో నీ చావు రాసిపెట్టాడు అని చెప్పాడు.

డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయినట్లు వెల్లడించాడు.ఇందులో తనతో కలిసి పలు సీన్లు చేసినట్లు వెల్లడించాడు.

ఈ సినిమాలో ఆమె నటన చూసి అబ్బుర పడినట్లు చెప్పాడు.ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్లు చేసిన ఆమె.సాహసవీరుడు సాగరకన్యలో తన నటనా విశ్వరూపాన్ని చూపించినట్లు చెప్పాడు.ఆమె పాత్ర చూస్తేనే తనకు భయం వేసిందన్నాడు.

తాజా వార్తలు