ఈ మెగా హీరోకు సీనియర్ల మీదే క్రష్ ఉంటుందట!

మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యాడు.మొదటి సినిమా తోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

దీంతో మెగా హీరోల లిష్టులో ఈయన క్రేజీ హీరోగా మారిపోయాడు.ఫస్ట్ సినిమా హిట్ తోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఈయనకు పెద్ద పెద్ద బ్యానర్ల నుండి వరుస అవకాశాలు వరించాయి.

ఇక ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న కూడా ఈయన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టు కున్నాడు.

Advertisement
Panja Vaishnav Tej Comments Viral On Social Media, Mega Hero, Vaishnav Tej, Rang

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తున్నాడు.గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.వైష్ణవ్ మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుసందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు మెగా మేనల్లుడు రెడీ అయ్యాడు.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ బిజీగా ఉన్నాడు.

Panja Vaishnav Tej Comments Viral On Social Media, Mega Hero, Vaishnav Tej, Rang

తాజాగా ఈయన ప్రొమోషన్స్ లో పాల్గొనగా ఆసక్తికర విషయాలు తెలిపాడు.అలీతో జాలీగా షోలో డైరెక్టర్ తో పాటు పాల్గొన్న వైష్ణవ్ తేజ్ ఆయన కెరీర్ లో ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించాడు.ఈ షో ప్రోమో తాజాగా రిలీజ్ అవ్వగా అది వైరల్ అయ్యింది.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విషయాన్నీ కూడా పంచుకున్నాడు.ఈయనకు చిన్నప్పటి నుండి సీనియర్ల మీదనే క్రష్ ఉండేదని.

Advertisement

తన తోటి ఏజ్ ఉన్న వారితో ఉండేది కాదని చెప్పుకొచ్చాడు.ఉప్పెన సినిమాలో చేపలు పడితే.

కొండపొలం లో మేకలు పట్టానని.ఇక ఇప్పుడు అమ్మాయిని పట్టానని సరదాగా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.బివిఎస్ఎన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజా వార్తలు