గ్రామాల్లో కనిపించని పంచాయతీ కార్యదర్శులు

సూర్యాపేట జిల్లా:ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలో 30 గ్రామాలకు గాను 25మంది విధులు నిర్వహిస్తుండగా ఇందులో ఇద్దరు కలెక్టరేట్ కు డిప్యూటేషన్ పై వెళ్ళారు.

కొందరు రెండేసి గ్రామాలకు ఇంచార్జీలు ఉన్నారు.

అయితే వివిధ గ్రామాల్లో పంచాయితి కార్యదర్షులు సక్రమంగా విధులకు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన తర్వాత వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే విధులకు వచ్చి,కొద్దిసేపు మాత్రమే ఆఫిస్ లో ఉండి వెళుతున్నారని,దీనితో గ్రామాల్లో పారిశుద్ద్యం,త్రాగునీరు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుటలో పంచాయతీ కార్యదర్శులు విఫలమైతున్నారని,గ్రామాల అభివృద్ధి కోసం వచ్చే నిధులను దేనికోసం ఖర్చు చేస్తున్నారనేది కూడా తెలియకుండా పోతుందని వాపోతున్నారు.కొన్ని గ్రామాల్లో పని చేసే కార్యదర్శులు ఇతర గ్రామాలకు ఇన్చార్జిలుగా చేస్తుండగా అక్కడి వారికి ఇక్కడ ఉన్నట్లు,ఇక్కడి వారికి అక్కడ ఉన్నట్లు చెప్పుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నసీంపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయకుండా గత కొన్ని నెలలుగా ఉంటుందని,రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని గ్రామస్తులు అంటున్నారు.ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శికి రామన్నగూడెం ఇన్చార్జి ఇవ్వడంతో ఇక్కడ ఉంటున్నారో అక్కడ అంటున్నారో తెలియక పనులు కుంటుపడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఇప్పటికైనా పంచాయితి కార్యదర్శులు సక్రమంగా విధులకు హాజరై గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయా గ్రామాల కోరుతున్నారు.ఇదే విషయమై ఎంపివో రాజేష్ వివరణ కోరగా 30 గ్రామాలకు గాను 25 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని,అందులో ఇద్దరు కలెక్టరేట్ కు డిప్యూటేషన్ పై వెళ్లగా,మిగతావారు విధులలో కొనసాగుతున్నారన్నారు.

గ్రూప్స్ నోటిఫికేషన్ కారణంగా కొందరు దీర్ఘకాల సెలవులు పెట్టడం జరిగిందని,అయినా ఉన్నవారితో గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తున్నామని,విధులకు సక్రమంగా రాకుండా ఉండే పంచాయతీ కార్యదర్శిలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Advertisement

Latest Nalgonda News