నా భార్యకు ఆరోగ్యం బాలేదు.. నా కొడుకుని జైల్లో వేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ తండ్రి!

తాజాగా తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే.

వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో రైతుబిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ షో ముగిసిన దగ్గర నుంచి కాంట్రవర్సీలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి.

అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.పలువురు మాజీ కంటెస్టెంట్ ల కార్ల అద్దాలను పగలగొట్టడంతో గీతూ రాయల్ వంటి వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

ఇక ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు పోలీసులు.అయితే ఈ విషయంపై కొందరు స్పందిస్తూ పోలీస్ స్టేషన్లో వేసి మంచి పని చేశారు అంటూ నెగిటివ్ గా స్పందిస్తుండగా పాపం అతను ఏం తప్పు చేశాడు అంటూ ఇంకొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు.తన కుమారుడిని అరెస్ట్ చేసి మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సందర్భంగా కొడుకు అరెస్ట్ పై సత్యనారాయణ మాట్లాడుతూ.

నా కొడుకు బిగ్‌బాస్ గెలిచిండని మురిసిపోయినా.ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది.

మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది.మా ఊర్లో ఉంటేనే బాగుండు.

లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నాను.నాకు వాంతులు కూడా అయ్యాయి.ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు.

Advertisement

అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా? మావాడు ఎక్కడికి పోలే.కానీ కొందరు కావాలనే పారిపోయాడని ఏవేవో వార్తలు రాసారు.

అనంతరం పోలీసుల తీరుపై స్పందిస్తూ.బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్‌ను తీసుకెళ్లారు.మాది మారుమూల గ్రామం.

బెయిల్ ఇలాంటి వన్నీ మాకు తెలియదు.నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు.

ఆమె ఏడుస్తూ కూర్చుంది.జ్వరం కూడా వచ్చింది.

మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టకండి సార్.పరేషాన్ చేసిర్రు.

బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు.ముందు మంచిగానే మాట్లాడారు.

ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి తీసుకెళ్లారు.వారెంట్ కూడా ఇయ్యలేదు.

దొంగతనం చేసినట్లు ప్రశాంత్‌ను తీసుకెళ్లారు.ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నాను.

నా కొడుకు దొంగ కాదు.బిగ్ బాస్‌కు పోతానంటే నేను పంపించినాను.

విన్నర్ అయ్యాడు.కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సత్యనారాయణ.

తాజా వార్తలు