పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులను ఎలా చేధించాలా అని పోలీసులు నానా తంటాలు పడుతుంటారు.
అయితే వారు కొన్ని కేసులు చేధించడంలో విజయం సాధిస్తే, మరికొన్ని కేసులు మాత్రం చేధించలేకపోతారు.
దీంతో అవి పెండింగ్‌లోనే ఉండిపోతాయి.కానీ వికారాబాద్ పోలీసులకు ఓ పెద్ద తలనొప్పి కేసు వచ్చి పడటంతో వారు ఏం చేయాలో అర్ధంగాక తలలు పట్టుకున్నారు.
రామయ్యగూడకు చెందిన బాణాల ప్రభు గాడిద పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అతడి వద్ద 22 గాడిదలు ఉన్నాయి.
కాగా ఇటీవల అందులో నుండి 4 గాడిదలు తప్పిపోయినట్లు అతడు వాపోయాడు.ఇదే విషయాన్ని పోలీసులకు కూడా తెలిపాడు.
గాడిదలు దొరికితే చెబుతాం అని పోలీసులు అతడిని పంపించారు.కాగా మోమిన్‌పేటలోని ఓ వ్యక్తి వద్ద తన రెండు గాడిదలు ఉన్నాయని తెలుసుకున్న ప్రభు అతడితో గొడవకు దిగాడు.
కానీ అవి తనవే అంటూ సదరు వ్యక్తి చెబుతున్నాడు.దీంతో ఈ పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది.
ఆ గాడిదలు ఎవరివో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.విచారణ జరిపిన తరువాత చెబుతాం అంటూ అక్కడి నుండి గాడిద యజమాని, ప్రభులను పంపించేశారు.
మనుష్యులనైతే గుర్తుపట్టవచ్చు కానీ గాడిదలు ఎవరివో ఎలా తెలుసుకోవడం అనేది ఇప్పుడు పెద్ద చిక్కప్రశ్నగా మారింది.మరి ఈ గాడిదల కేసును వారు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy