ముంబైలో ఘోర రోడ్ యాక్సిడెంట్.. షాకింగ్ వీడియో వైరల్..

ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) జరుగుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి.2019లో, భారతదేశంలో 480,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి, ఫలితంగా 150,000 మంది మరణించారు.

అంటే భారతదేశంలో రోజుకు సగటున 414 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.

అతివేగంతో డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) పాటించకపోవడం, మందు తాగి నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిద్రమత్తుతో డ్రైవింగ్, రోడ్లు సరిగా ఉండకపోవడం వంటివెన్నో భారతదేశంలో యాక్సిడెంట్స్ జరగడానికి కారణం అవుతున్నాయి.అయితే చేయని తప్పుల కారణంగా కూడా కొందరు అన్యాయంగా ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

అప్పుడప్పుడు వీటికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తాజాగా ముంబైలో( Mumbai ) జరిగిన ఒక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.

ఇది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

వివరాల్లోకి వెళితే, ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో( Goregaon ) ఒక విషాద సంఘటనలో, అదుపు తప్పిన కారు ఆటోరిక్షాను ఢీకొట్టింది.ఈ సంఘటన 2023, అక్టోబర్ 2న సుమారు 12:29 గంటలకు జరిగింది.ప్రమాదం జరిగిన సమయంలో ఆటోరిక్షాలో( Auto Rickshaw ) ఓ మహిళ ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో ఆ మహిళకు ఎంత తీవ్రమైన గాయాలు అయ్యాయో తెలియ రాలేదు.డ్రైవర్ మాత్రం కారు వేగంగా వచ్చి డ్యాష్ ఇవ్వడంతో ఎగిరి చాలా దూరం పడిపోయాడు.

అతనికి బాగానే గాయాలైనట్లు తెలిసింది.చాలా సురక్షితంగా పక్కకు తీసి ఆటోను డ్రైవర్ పార్క్ చేశాడు.అయినా కూడా కారు డ్రైవర్( Car Driver ) సరిగ్గా ఈ ఆటోని వచ్చి ఢీ కొట్టాడు.

ఈ దుర్ఘటన జరిగిన క్షణాల్లోనే స్థానికులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు హుటాహుటిన వచ్చారు.డ్రైవర్ ఎలాంటి కండిషన్లో ఉన్నాడో ఇంకా తెలియ రాలేదు.బహుశా స్థానికులు అతడిని పోలీసులకు పట్టించి ఉండవచ్చు.

వైరల్ వీడియో : అందరూ చూస్తుండగానే రోడ్డుపై తుపాకితో చెలరేగిన వ్యక్తి.. చివరకు..
Advertisement

తాజా వార్తలు