జగన్ క్రేజ్ తగ్గిందా .. ఇదే నిదర్శనమా ?

గతంతో పోలిస్తే ఏపీ సీఎం జగన్ ఇమేజ్ బాగా తగ్గిపోయిందని వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని ప్రచారం గత కొంతకాలంగా టిడిపి చేస్తూనే ఉంది దీనికి తగ్గట్టుగానే జగన్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగాను , జనాలకు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉండటంతో, ఇదే నిజమని భావన అందరిలోనూ వచ్చింది.

సంక్షేమ పథకాలు వరకు జగన్ విషయంలో జనాల్లో ఉన్నా,  అభివృద్ధి విషయంలో  మాత్రం ఏపీ పూర్తిగా వెనుకబడి పోయిందని, ఎక్కడా అభివృద్ధి కనిపించకపోగా, నిధులు మొత్తం సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడుతున్నారు అనే అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది.

రోడ్లు దుస్థితి దారుణంగా ఉందని జనాల్లో అభిప్రాయం ఉంది.దీనిని మరింత రెచ్చగొట్టే విధంగా టిడిపి ,జనసేన, బీజేపీ వంటి పార్టీలు ఈ విషయంలో జనాలు చర్చ జరిగేలా చేస్తున్నాయి.

అయితే ఏపీలో 2019 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసిపి తన సత్తా చాటుకుంది.దీంతో వైసిపి పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది.

కాకపోతే గతంలో జగన్ పై ఉన్నంత సానుకూలత అయితే ప్రస్తుతం కనిపించడం లేదు.  2024 ఎన్నికల నాటికి వైసిపి మరింత బలహీన పడుతుందనేది వాస్తవం.

Advertisement

ఏపీలో వైసీపీ ప్రభుత్వం గ్రాఫ్ తగ్గుతోందనే విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు బీజేపీ హైకమాండ్ కు నివేదిక రూపంలో అందించారు.ముఖ్యంగా మధ్యతరగతి ఉన్నత ఉద్యోగ వర్గాల్లో వైసీపీ ప్రభుత్వం పై గతంతో పోలిస్తే బాగా వ్యతిరేకత జరిగిందనే విషయాన్ని ప్రతిపక్షాలతో పాటు,  వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. 

అయితే ఈ వ్యతిరేకత ఓట్ల రూపంలోకి వచ్చేసరికి పెద్దగా కనిపించకపోవడం, విజయానికి ఎటువంటి డోకా లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.  కానీ మెజారిటీ గతంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టడం , టిడిపికి క్రమ క్రమంగా ఆదరణ పెరుగుతూ ఉండడం ఇవన్నీ వైసీపీకి రాబోయే ప్రమాద సూచికలను తెలియజేస్తున్నాయి.వైసీపీ ఇమేజ్ కాస్త తగ్గింది అనడానికి నిన్న వెలువడిన  ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

వైసీపీకి తగ్గిన మెజారిటీని , టిడిపికి ఓటమి ఎదురైనా ఓటుబ్యాంకు పెరగడం ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు