'ఆహా' ఓటీటీ ఖాతాదారులకు పండుగలాంటి వార్త ఇది

ఆహా లో మరో ఇంట్రెస్టింగ్‌ సినిమా స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్లే బ్యాక్ సినిమా కు మంచి రివ్యూలు వచ్చాయి.

మరో వైపు ఆహా లో వరుసగా మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.ఈ వారంలో మలయాళం మూవీ డబ్బింగ్‌ వర్షన్‌ అనుకోని అతిథి స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది.

స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా కోసం సెలబ్రెటీలు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దానికి కారణం ఈ సినిమా లో మన స్టార్‌ హీరోయిన్ సాయి పల్లవి నటించడంతో పాటు మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్ హీరోగా నటించాడు.

వీరిద్దరి కాంబోలో రూపొంది 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయాలని భావించారు.కాని కొన్ని కారణాల వల్ల థియేటర్‌ రిలీజ్‌ క్యాన్సిల్‌ అయ్యింది.

Advertisement

ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కు ఏర్పాట్లు చేశారు.ఇటీవల వచ్చిన ట్రైలర్‌ తో సినిమా పై పీక్స్‌ కు చేరుకున్నాయి.

ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీలో ఈ సినిమా కోసం మొన్నటి వరకు ఎదురు చూశారు.

కాని ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.తప్పకుండా ఇదో యూనిక్‌ సినిమా నిలుస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న ఈ సినిమాతో ఆహా ఖాతాదారులకు పండుగ ఖాయం అంటున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్‌ తో ఈ సినిమాను మనోల్లు సక్సెస్‌ చేస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నాయి.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ చూస్తనే అర్థం అవుతుంది.ఖచ్చితంగా ఈ సినిమా మరో లెవల్ లో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

పుష్ప సినిమా తో ఫహద్ ఫాజిల్ నటించబోతున్నాడు.ఆయనే ఈసినిమాలో హీరో అవ్వడం కూడా కలిసి వచ్చే అంశం.

తాజా వార్తలు