కరోనా సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఆ సమస్యలు!

గత కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు పూర్తిస్థాయి లో వ్యాక్సిన్ రాకపోగా కొంతవరకు వైద్యుల సహాయం మేరకు కరోనా వైరస్ ను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కొంత శాతం కరోనా బాధితులు వైరస్ నుండి కోలుకోగా మిగతా శాతం ప్రాణాలు కోల్పోతున్నారు.కాగా ప్రస్తుతం వైరస్ నుండి మరో ముప్పు ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

కరోనా వైరస్ లక్షణాలు తీవ్రమైన గొంతు నొప్పి, జలుబు, జ్వరం తో ఉండగా ప్రస్తుతం మరో సమస్య తో ముప్పు తెస్తుంది.పూర్తిస్థాయి లక్షణాలతో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందులోనే సైడ్ ఎఫెక్టులు కలుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

చాలావరకు కరోనా తగ్గుముఖం పట్టగా ఇప్పుడు మరింత తీవ్రతతో ఆందోళనలకు గురి చేస్తుంది.అందులో ముఖ్యంగా మానసిక సమస్య ఏర్పడుతుందని ఆక్సఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో తేలగా మరో ప్రభావం కూడా ఉంటుందని ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధి, గుండె, నరాల తీరు వ్యవస్థ, కిడ్నీల పై తీవ్రమైన ప్రభావం ఉందని వైద్య నిపుణులు తమ పరిశోధనల్లో తెలిపారు.

Advertisement

అంతేకాకుండా ఈ కరోనా వైరస్ సోకిన వారి లో మెదడుపై ప్రభావం చూపుతూ మానసికంగా అనారోగ్యానికి గురి చేస్తుందని తేలింది.ఇదిలా ఉంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ వైరస్ వల్ల మానసిక వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు తెలుపుతున్నారు.ఈ వైరస్ వల్ల కొందరి లో మెదడు పనిచేయకుండా ఉంటుందని పైగా కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయని ఆక్స్ ఫర్డ్ నిపుణుల అధ్యయనాల్లో తేలింది.

కాగా ఈ వైరస్ వల్ల మరింత తీవ్రతమైన ప్రభావం ఉండడంవల్ల తగిన జాగ్రత్తలతో ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు