Emraan Hashmi OG : ఇద్దరిలో ఒకరి తల మాత్రమే మిగులుతుంది.. ప్రామిస్.. ఓజీలో ఇమ్రాన్ షష్మీ రోల్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం పవన్ ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తున్నారు.

 Og Dialogue Becomes Popular Than Emraan Hashmi First Look-TeluguStop.com

అయితే మొన్నటి వరకు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో రాజకీయలపై దృష్టి పెట్టారు.ఆ సంగతి పక్కన పెడితే.

ప్రస్తుతం పవన్ ఓజీ సినిమా( OG Movie ) చేస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఓజీ సినిమా నుంచి పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్ చేశారు.

నిజానికి రిలీజైంది డైలాగ్ కాదు.

Telugu Emraan Hashmi, Sujeeth, Og, Og Dialogue, Pawan Kalyan, Pawan Kalyan Og, T

సినిమాలో విలన్ పాత్రధారి ఇమ్రాన్ హస్మి( Emraan Hashmi ) లుక్.కానీ దానికంటే డైలాగ్ ఎక్కువగా పాపులర్ అవుతోంది.సుజీత్ దర్శకత్వంలో( Director Sujeeth ) పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు పవన్ కల్యాణ్.

ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి.ఈ సినిమా నుంచి అతడి ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా పవర్ ఫుల్ డైలాగ్ కూడా రిలీజ్ చేశారు.గంభీర, నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా, ప్రామిస్, ఇద్దరిలో ఒక తల మాత్రమే మిగులుతుంది.

ఇమ్రాన్ ఫస్ట్ లుక్ తో పాటు ఈ డైలాగ్ ను విడుదల చేశారు.పోస్టర్ లో స్టయిలిష్ గా సిగార్ వెలిగిస్తున్న ఇమ్రాన్ ఫొటో కంటే, ఈ డైలాగ్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu Emraan Hashmi, Sujeeth, Og, Og Dialogue, Pawan Kalyan, Pawan Kalyan Og, T

నిజానికి ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పై లేదు.ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్, తన సినిమాలన్నీ పక్కనపెట్టి చాన్నాళ్లు అయ్యింది.అయితే ఓజీ టీమ్ మాత్రం ఏదో ఒక ప్రకటనతో నిత్యం ప్రాజెక్టును జనాల్లో నలిగేలా చేస్తోంది.మొన్నటికి మొన్న విడుదల తేదీ ప్రకటించింది.ఆ తర్వాత తమ సినిమాపై వచ్చిన పుకార్లను ఖండిస్తూ ప్రకటన చేసింది.తాజాగా ఇమ్రాన్ హస్మి లుక్ రిలీజ్ చేసింది.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube