సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మతా శిశు ఆసుపత్రిలో ఆదివారం టీకా వికటించి పసికందు మృతి చెందిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట మండలం( Suryapet Mandal) బాలెంల గ్రామానికి చెందిన గర్భిణీ కల్లేపల్లి యోగిత భర్త సంపత్ తో కలిసి కాన్పు కోసం శనివారం ఉదయం నాలుగు గంటలకు ఏరియా ఆస్పత్రిలోని మాతా శిశు కేంద్రానికి రాగా రాత్రి 8 గంటలకు మగ బిడ్డకు జన్మనిచ్చింది.
తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.ఆదివారం ఉదయం పది గంటలకు శిశువుకు టీకా వేశారు.
అప్పటివరకు బాగానే ఉన్న పసికందు టీకా వేసిన వెంటనే అస్వస్థకు గురయ్యాడు.
బాబుకు బాగాలేదని వైద్యులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మరణించాడని తల్లిదండ్రులు మీడియా ముందు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆరోపించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.మాతా శిశు కేంద్రంలో జరుగుతున్న వరుస మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు( Medical Health Department officials) సమగ్ర విచారణ జరిపి సరైన చర్యలు తీసుకోవాలని,ఇక్కడికి రావాలంటేనే గర్భిణీలు భయపడుతున్నారని బాధితులు వాపోతున్నారు.