హ్యాట్సాప్‌ : ఈ ఐఏఎస్‌ అధికారి చేసిన పనికి చేతులు జోడించి దండం పెట్టినా తప్పులేదు

సాదారణంగా నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటారు.

ప్రభుత్వ ఉద్యోగం అయితే సెక్యూరిటీగా ఉంటుందని మరియు ముఖ్యంగా ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఎన్ని పడితే అన్ని పెట్టుకోవచ్చు.

ఒక్కోసారి సంవత్సరాల తరబడి కూడా సెలవులు పెట్టుకునే వెసులుబాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది.అదే ప్రైవేట్‌ ఎంప్లాయి నెల రోజులు రాకుంటే మరెవ్వరినైనా చూసుకుంటూ ఉంటారు.

అందుకే ఎక్కువ శాతం మంది ముఖ్యంగా ఇండియన్స్‌ ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటారు.ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు సేవ చేసే వీలుంటుంది.

కాని ఆ విషయాన్ని ఎవరు గుర్తించరు.తమకు డబ్బులు వస్తున్నాయా.

Advertisement

ఇతర ఫెసిలిటీస్‌ను అనుభవిస్తున్నామా అనే చూస్తారు.కాని అందరు అలా ఉంటారని మాత్రం మేము చెప్పడం లేదు.

కొందరు గొప్ప వారు కూడా ఉంటారు.భువనేశ్వర్‌కు చెందిన ఐఏఎస్‌ నికుంజా ధల్‌ గారిని చూస్తుంటే మంచి తనంకు మారు పేరు అన్నట్లుగా ఉంటారు.

ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అవ్వడంతో పాటు ప్రజల పట్ల సమాజం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ద గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒడిశ్శా ప్రభుత్వం కరోనా కారణంగా హెల్త్‌ ఎమర్జెన్సీని విధించింది.

అక్కడ రోజులో 15 గంటలకు ఎక్కువగా పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.వారిలో ఒకరు నికుంజా ధల్‌.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

ప్రభుత్వ అధికారుల సెలవులు అన్నీంటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.అలాంటి సమయంలో నికుంజా ధల్‌ తండ్రి మృతి చెందారు.

Advertisement

డ్యూటీలో ఉన్న నికుంజాకు తండ్రి మరణించిన విషయాన్ని తెలియజేయగా వెంటనే వెళ్లాడు.

నికుంజా వెళ్లేప్పటికి ఆయన ఇంట్లో అంతా కూడా శోఖసంద్రంలో మునిగి పోయారు.చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహించి తండ్రికి ఘన నివాళి సమర్పించాలనే ఉద్దేశ్యంతో 24 గంటలలోపే డ్యూటీకి హాజరు అయ్యాడు.నికుంజా ధల్‌ తండ్రి మరణం కారణంగా కనీసం మూడు నాలుగు రోజులు అయినా సెలవులు పెడతారని అంతా అనుకున్నారు.

కాని ఆయన ఒక్క రోజులోనే తిరిగి రావడం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.అందుకే నికుంజా ధల్‌కు రెండు చేతులు జోడిచ్చి దండం పెట్టినా తక్కువే అంటూ స్థానికులు అంటున్నారు.

తాజా వార్తలు