పాతాళ భైరవి సినిమా చెయ్యాలనుకున్న ఎన్టీఆర్.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాకుండా ప్రేమ కథ చిత్రాలు, పౌరాణిక చిత్రాలలో కూడా ఎంతో అద్భుతంగా నటించి తనకు తానే సాటని నిరూపించుకున్నారు.

ఇలా ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు చిత్రాలలో పాతాళభైరవి సినిమా ఒకటి.1951లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, ఎస్ వి రంగారావు, కె.మాలతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పాతాళ భైరవి.ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు.

విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్ పై ఆలూరి చక్రపాణి, బి.నాగిరెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.ఇలా 1951 మే 17 న విడుదలైన ఈ సినిమా ఏకంగా 200 రోజులు థియేటర్లు ఆడి రికార్డులు నెలకొల్పింది.

ఇలాంటి రికార్డులు అన్నగారి చరిత్రలో ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు.

ఇక నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి మూడవతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తన తాత సినిమాలలో బాల నటుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన తాత నటించిన పాతాళభైరవి సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ఈ క్రమంలోని ఈ సినిమా చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా మొదలయ్యాయి.అయితే ఈ సినిమా చేయబోతున్నారని ప్రకటన వచ్చిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.

ఇలా పాతాళభైరవి సినిమా చేయాలని భావించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు చెయ్యలేదు అనే విషయానికి వస్తే.ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఎంతోమంది ప్రముఖ దర్శకులు ఈ సినిమా గురించి విమర్శలు చేశారు.అన్న గారు నటించిన చిత్రాన్ని మరోసారి తెరకెక్కించడం వల్ల ఈ తరం వారికి ఈ సినిమా పెద్దగా నచ్చదని విమర్శలు చేశారు.

అలాగే మరికొందరు అన్న గారి నటన నైపుణ్యం మరోసారి ఈ సినిమాలో కనిపించదని చాలామంది ఈ సినిమా గురించి విమర్శలు చేయడంతో ఈ సినిమా చేసిన ఈ తరం వారికి నచ్చదన్న ఉద్దేశంతో తారక్ కూడా ఈ సినిమాలో నటించడానికి వెనకడుగు వేశారు.

ఈ కారణంగా అన్న గారు నటించిన పాతాళభైరవి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది.ఇక పాతాళభైరవి సినిమా చేయలేక పోయినప్పటికీ అలాంటి పౌరాణిక చిత్రాలలో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ చిత్రంలో నటించి పౌరాణిక చిత్రాలలో నటించడంలోనూ తాతకు తగ్గ మనవడని పేరు సంపాదించుకున్నారు.ఇలా ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి విశేషమైన ప్రేక్షకాదారణ దక్కించుకున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈ క్రమంలోని ఈయన ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలను నటించే స్థాయికి ఎదిగారు అంటే ఈయన నటన నైపుణ్యం ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిపోతుంది.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా జనవరి 7వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు