బిజినెస్ మ్యాన్‌గా మారుతున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తోండగా మరో హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడట.

అటు ఈ సినిమాలో తారక్ ఓ బిజినెస్‌మెన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.అల్ట్రా స్టైలిష్ లుక్‌లో తారక్ ఈ సినిమాలో మనకు కనిపిస్తాడట.

Advertisement

మొత్తానికి ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.అటు ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో తారక్ కొత్త అవతారం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.మరి ఈ సినిమాతో తారక్-త్రివిక్రమ్ కాంబో మరో బ్లాక్‌బస్టర్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు