బాబాయి కోసం ఎన్టీఆర్‌ తగ్గుతాడా?

స్టార్‌ హీరోల సినిమాల మధ్య గ్యాప్‌ ఉండేలా గత కొంత కాలంగా సినిమాల విడుదల అవుతుండటాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం.

ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు కనీసం రెండు లేక మూడు వారాల గ్యాప్‌లో తమ తమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్‌, బాలకృష్ణలు ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నారు.ముందుగా ఎన్టీఆర్‌ సంక్రాంతి రేసులో నిలిచాడు.

ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు.తాజాగా జనవరి 14న బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ అధికారికంగా ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

‘డిక్టేటర్‌’ సంక్రాంతి బరిలో దిగడం ఖాయం అవ్వడంతో ఎన్టీఆర్‌ తన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విషయంలో కాస్త వెనుక ముందు ఆడుతున్నట్లుగా తెలుస్తోంది.బాబాయికి పోటీగా తన సినిమాను విడుదల చేయడం ఎన్టీఆర్‌కు ఇష్టం ఉన్నట్లుగా లేదు.

Advertisement

అందుకే నిర్మాతతో విడుదల వాయిదా వేయడం లేదా ముందుకు జరపడం చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అవ్వని నేపథ్యంలో చిత్రాన్ని ముందుకు జరపడం కష్టం.

అందుకే విడుదల కనీసం 15 రోజులు వాయిదా వేసే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.మొత్తానికి బాబాయి కోసం ఎన్టీఆర్‌ కాస్త తగ్గాడు.

Advertisement

తాజా వార్తలు