దేవర ట్రైలర్ తోనే ప్రమోషన్స్ ప్రకంపనలు.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు దేవర( Devara ).

ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్( RRR ) లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ ( NTR )నటించిన సినిమా ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.

దానికి తోడు ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను కాస్త అదింత పెంచాయి.దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.కానీ ప్రమోషన్స్ విషయంలో మూవీ మేకర్స్ చాలా లైట్ గా ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సెప్టెంబర్ 10 దేవర ట్రైలర్ ( Devara trailer )అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వినాయక చవితి సందర్భంగా ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.

Advertisement

అయితే దేవర ప్రమోషన్స్ ను ఆ సెప్టెంబర్ 10 ట్రైలర్ తోనే స్టార్ట్ చేయబోతుంది టీమ్.దేవర ట్రైలర్ ను ముంబై వేదికగా లాంచ్ చేసేందుకు బిగ్ ప్లాన్ రెడీ అవుతుంది.

అక్కడ ముంబై లో ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివ( Janhvi Kapoor, Saif Ali Khan, Koratala Shiva ) ఇంకా కీలక టెక్నీషియన్స్ నడుమ కరణ్ జోహార్ హోస్ట్ గా దేవర ట్రైలర్ లాంచ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తోంది.

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ ( Dharma Productions )దేవర నార్త్ రైట్స్ కొనుగోలు చేసి బాలీవుడ్ లో విడుదల చెయ్యబోతుంది.సో అలా కరణ్ దేవర ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు.దేవర ట్రైలర్ నుంచే ప్రమోషన్స్ ప్రకంపనలు కూడా మొదలు కాబోతున్నాయి.

మరి ప్రమోషన్స్ నుంచే ప్రకంపనలు కూడా మొదలైన ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు