హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఎన్టీఆర్ బావమరిది

టాలీవుడ్ అంటే ముందుగా వినిపించే పేరు నందమూరి ఫ్యామిలీ.

నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వం తీసుకొని బాలకృష్ణ, హరికృష్ణ వస్తే అందులో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు.

ఎన్టీఅర్ మనవాళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న సినిమాలలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే స్టార్ హీరోగా మారిపోయి ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ కూడా ఇటు హీరోగా, అటు నిర్మాతగా మినిమం రేంజ్ హీరోగా నిలబడ్డాడు.అయితే తారకరత్న హీరోగా సక్సెస్ కాలేకపోయిన నటుడుగా ప్రూవ్ చేసుకొని విలన్ పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అండతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే గత కొంత కాలంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

ఎన్టీఆర్ భార్యకి సొంత తమ్ముడు అయిన నితిన్ తెరంగేట్రం కోసం ఓ మంచి లవ్ స్టొరీని సెలక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు.ఇక మొదటి సినిమాకి తన తండ్రి నార్నే శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఇక భావ ఎన్టీఆర్ సపోర్ట్ ఎలాగూ తనకి ఉంటాయి కాబట్టి అతని అండతో ముందుగా అవకాశాలు పెంచుకుంటే తరువాత తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి నార్నే నితిన్ సిద్ధం అవుతున్నాడు.తారక్ సైడ్ నుంచి వస్తున్న ఈ హీరో పరిచయం వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది.

మరి దానికోసం ఈ యంగ్ టాలెంట్ ఎలాంటి కథని సెలక్ట్ చేసుకుంటాడు అనేది వేచి చూడాలి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు