ఎన్టీఆర్‌ కారణంగా జక్కన్న మల్టీస్టారర్‌ మరింత ఆలస్యం  

టాలీవుడ్‌ ప్రేక్షకులు గత సంవత్సర కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్‌ మల్టీస్టారర్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ మొదట అక్టోబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కాని సినిమా వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది. డిసెంబర్‌ లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని రాజమౌళి భావించాడు. అందుకోసం సినిమా కోసం ఎన్టీఆర్‌ను సిద్దం చేయాలని రాజమౌళి భావించాడు.

Ntr Behind Rajamouli Multistarrer Movie Delay-

Ntr Behind Rajamouli Multistarrer Movie Delay

తాజాగా ‘అరవింద సమేత’ చిత్రాన్ని పూర్తి చేసిన ఎన్టీఆర్‌ ఆ చిత్రంతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ వెంటనే రాజమౌళి సినిమా కోసం టైం కేటాయించాడు. కాని తాజాగా ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ మరణించిన విషయం తెల్సిందే. ఆ విషాదం నుండి తేరుకునేందుకు కూడా ఎన్టీఆర్‌ సమయం చిక్కలేదు. వెంటనే సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. తాజాగా అరవింద సమేత పూర్తి చేసిన ఎన్టీఆర్‌ దాదాపు నెల రోజుల పాటు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్‌ దసరా తర్వాత ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో పాల్గొంటే సినిమాను డిసెంబర్‌లో మొదలు పెట్టవచ్చని రాజమౌళి భావించాడు. కాని తాజాగా రాజమౌళిని ఎన్టీఆర్‌ తనకు కాస్త టైం కావాలి అంటూ కోరినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ కోరిక మేరకు మల్టీస్టారర్‌ చిత్రాన్ని మరింత ఆలస్యం చేయాలని జక్కన్న భావించాడు. మరో వైపు రామ్‌ చరణ్‌ కూడా బోయపాటి మూవీలో బిజీగా ఉన్నాడు.

Ntr Behind Rajamouli Multistarrer Movie Delay-

ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చకచక జరుగుతుంది. అది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి తర్వాత జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రం పట్టాలెక్కడం కష్టంగానే ఉందని, వచ్చే వేసవికి సినిమా షూటింగ్‌ ప్రారంభం వాయిదా పడ్డట్లే అంటూ ప్రచారం జరుగుతుంది.